బోడ కాకర కాయతో బోలెడు లాభాలు..

బోడ కాకర కాయలను క్రమం తప్పకుండా  తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు.

కాకరకాయ వాలే దీంతో కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని అంటున్నారు వైద్యులు

 ఇందులో ఉండే గుణాలు చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

బోడకాకరలోని విటమిన్స్, అమైనో ఆమ్లాలు, ప్లేవనాయిడ్స్, పోటాషియం, ఫాస్పరస్ లాంటివి పుష్కలంగా లభిస్తాయి.

 డయాబెటిస్ ఉన్నవారు వర్షాకాలంలో దీన్ని తీసుకొంటే రక్తంలోని చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.

ఇవి క్యాన్సర్ లాంటి సమస్యలు దరి చేరకుండా కాపాడుతాయి. బోడకాకర రక్తపోటు, గుండె సమస్యలను కూడా దరిచేరనివ్వదు.

ఇది వర్షాకాలంలో  జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్స్ నుంచి కూడా రక్షణ కల్పిస్తుంది

బోడ కాకరలో కాల్షియం కూడా పుష్కలంగా లభిస్తుంది. ఇది ఎముకల బలోపేతానికి సహాయపడుతుంది.