ఉదయాన్నే ఖాళీ కడుపుతో  వేపాకులు తింటే జరిగేదిదే..!

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేపాకులను నమలడం వల్ల మలబద్దకం సమస్య నుంచి బయట పడవచ్చు. 

వేపలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మలబద్దకం సమస్యను పరిష్కరిస్తుంది.

అంతే కాకుండా కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం ఇస్తుంది.

రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంచుకోవడానికి వేప ఆకులను తీసుకోవచ్చు.

ఖాళీ కడుపుతో వేపాకులను తీసుకోవడం వల్ల కాలేయానికి చాలా మేలు జరుగుతుంది. 

వేపాకులను ఉదయాన్నే ఖాళీ కడుపుతో 4 నుంచి 5 ఆకులు తినవచ్చు. ఇవి కూడా ముదురుగా కాకుండా లేత ఆకుపచ్చ రంగులో ఉండాలి.