టమాట..! ఈ పేరు వినని  తెలుగు వారు ఉండరు.

 ప్రతి ఇంట్లో ఈ కూరగాయ లేకుండా వంట పూర్తి కాదు.

పప్పు, ఉప్మా, కిచిడీ, కూర.. ఎందులో చూసినా టొమాటోలేనని దర్శనమిస్తాయి

కొందరు చారులో కరివేపాకుని వేరుచేసినట్టు టొమాటో ముక్కల్ని తీసి పడేస్తుంటారు. దీన్లో పోషకాల గురించి తెలిస్తే ఇకపై అలా చేయలేరు

టొమాటోలో ఫోలేట్, పొటాషియం, విటమిన్‌ సి, విటమిన్‌ కె వంటి సూక్ష్మ పోషకాలు అధికం

దీన్లో యాంటీ ఆక్సిడెంట్లూ పుష్కలం. ఇవి గుండెకు, మెదడుకు మేలు చేస్తాయి. కణాలు దెబ్బతినకుండా కాపాడి క్యాన్సర్‌ ముప్పుని తగ్గిస్తాయి

టమాటా టైప్‌-2 డయాబీటిస్‌ ప్రమాదాన్ని నివారిస్తుంది.

వీటిలోని పోషకాలు రక్తపోటునీ తగ్గిస్తాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.  దీన్లోని లైకోపీన్‌ కెరోటినాయిడ్‌ పిగ్మెంట్‌... ఆల్జీమర్స్‌ బారిన పడకుండా కాపాడుతుంది