చాలా మందికి మటన్ అంటే ఎంత ఇష్టమో చెప్పనక్కర్లేదు.స్పెషల్ డేస్‌లో, ఆదివారాల్లో దీన్ని ప్రత్యేకంగా పలు రకాల వంటకాలను చేసుకుని కుటుంబ సభ్యులతో కలిసి ఆస్వాదిస్తారు.

మటన్ తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొందరు దీనిని మితిమీరిన స్థాయిలో తీసుకుంటే అనారోగ్యం సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటున్నారు నిపుణులు.

 100 గ్రాముల మటన్ లో 143 కేలరీలు, 27 గ్రాముల ప్రోటీన్, 3 గ్రాముల కొవ్వు, 86 మి.గ్రా సోడియం, 3.7 మి.గ్రా ఐరన్, 75 మి.గ్రా కొలెస్ట్రాల్ ఉంటుంది.

కాలేయం సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నవారు మటన్ ని పూర్తిగా నివారించాలి. మటన్‌లో అధికంగా ఉండే ప్రోటీన్, కొవ్వు కారణంగా లివర్‌పై ఒత్తిడి పెరుగుతుంది.

హై బీపీ ఉన్నవారు మటన్‌ను మితంగా తినాలి. దీనిలో సోడియం, కొలెస్ట్రాల్ అధికంగా ఉండడం వల్ల రక్తపోటును పెంచే అవకాశం ఉంది.

కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నవారు దీనిని పూర్తిగా మానేయడం మంచిది.

గర్భిణీలు మటన్ ని మితంగా తీసుకోవాలి. చాలా వేడిగా ఉండే ఈ ఆహారం గర్భస్రావానికి కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు.