ఆహారాన్ని వేగంగా తింటున్నారా..  అయితే ఈ సమస్యలు తప్పవు

ఆహార వేళలు క్రమం తప్పకుండా కచ్చితంగా పాటించటం వల్ల అసిడిటీ, అజీర్తి లాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. 

ఆహారాన్ని గబగబా తినే అలవాటు మంచిది కాదు. అలాగే తినే సమయంలో మాట్లాడకూడదు.

భోజనం వేగంగా తినడం ఆరోగ్యానికి చేటు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. 

ఇలా చేస్తే ఆహారంతోపాటు గాలి కూడా జీర్ణాశయంలోకి చేరి అజీర్తిని కలిగిస్తుంది.

నోట్లోనే సగం ఆహారం జీర్ణమవుతుంది. కాబట్టి పదార్థాలను బాగా నమిలి మింగాలి.

తినే సమయంలో కాకుండా తిన్న తర్వాతే నీళ్లు తాగాలి.