వామ్మో.. కుంకుమ పువ్వు టీ తాగితే
ఇన్ని లాభాలా?
కుంకుమ పువ్వు టీ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
ఇది మలబద్దకం, అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.
రాత్రి పడుకునే ముందు కుంకుమ పువ్వు టీ తాగడం వల్ల ఆహారం సజావుగా జీర్ణమవుతుంది.
కుంకుమ పువ్వు టీ తాగడం వల్ల కడుపు కండరాల తిమ్మిరి, కడుపు ఉబ్బరం, అలసట, నెలసరికి ముందు, తరువాత వచ్చే లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది.
కుంకుమ పువ్వులో విటమిన్-సి, విటమిన్-బి, రిబోప్లేవిన్ వంటి విటమిన్లు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడతాయి.
కుంకుమ పువ్వులో పెద్ద మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలో కాన్సర్ కణాలు పెరగకుండా నిరోధించే సామర్థ్యం కలిగి ఉంటాయి.
కుంకుమ పువ్వు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో, మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది.
ఇది అవగాహనం కోసం అందించిన చిట్కా అని గుర్తించాలి. సమస్య ఏదైనా వైద్యుడి సలహా, చికిత్స ముఖ్యమైనది.
Related Web Stories
ఎర్ర రక్త కణాల సంఖ్యను పెంచడంలో సహాయపడే పోషకాలు ఇవే..
మూడు రోజులు కేవలం ద్రాక్ష పళ్లు తినడం వల్ల లాభాలు తెలిస్తే మతిపోవాల్సిందే..
సమ్మర్లో సపోటా పండు తింటే ఎన్ని ప్రయోజనాలు తెలిస్తే ఇప్పుడే తింటారు..
ఈ ఒక్క పండు తింటే చాలు.. ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్..