రోజూ ఒక ఆపిల్ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది

ఆపిల్స్‌లో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి

ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, జీర్ణక్రియకు సహాయపడతాయి

బరువు తగ్గించడంలో తోడ్పడతాయి, కొన్ని దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి

చాలా మంది కట్ చేసిన ఆపిల్స్ ని వెంటనే తినడానికి ఇష్టపడతారు

ఎందుకంటే ఆపిల్ కోసిన కొంత సమయానికి నల్లగా మారుతుంది

అయితే, కట్ చేసిన తర్వాత ఆపిల్ నల్లగా మారకూడదనుకుంటే.. ఈ చిట్కాలు ట్రై చేయండి

ఆపిల్ ముక్కలపై తేనె, నిమ్మరసం, ఉప్పు నీళ్లు, పూయడం వల్ల ఆపిల్ రంగు మారకుండా ఉంటుంది.