నానబెట్టిన గుమ్మడి గింజల నీరు తాగితే..
గుమ్మడికాయతో పాటుగానే గింజలు కూడా రెట్టింపు ఆరోగ్యాన్ని అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
గుమ్మడి గింజలు ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్లు (ముఖ్యంగావిటమిన్ కె, ఈ) ఖనిజాలు (మెగ్నీషియం,జింక్వంటివి)తో నిండి ఉంటాయి.
రోజూ స్పూన్ గుమ్మడి గింజలు తినటం వల్ల బోలెడన్నీప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు.
ఈ గుమ్మడి గింజలను రాత్రి నీళ్లలో నానాబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగటం వల్ల అంతే ప్రయోజనం ఉందంటున్నారు నిపుణులు.
గుమ్మడి గింజల నీరు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. బీపీని కంట్రోల్ చేస్తుంది. గుండె ఆరోగ్యానికి మంచిది.
గుమ్మడి గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మీ జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.
గుమ్మడికాయ గింజల్లో జింక్ పుష్కలంగా ఉంటుంది. దీంతో జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది.మెదడు వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది.
మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచడంలో గుమ్మడికాయ గింజలు సహాయపడతాయి.
గుమ్మడి గింజలను రాత్రంతా నానపెట్టండి. లేదా కనీసం ఆరు గంటలైన నానపెట్టి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
వీళ్ళు బీరకాయ ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు..
మీ కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఈ విషయాలు తెలుసుకోండి..
ఖాళీ కడుపుతో జామ ఆకులు నమిలితే సూపర్ బెనిపిట్స్
వర్షాకాలంలో మునగ ఎందుకు తినాలంటే..