కొవ్వును ఇట్టే కరిగించేస్తుంది.. ఇది మామూలు పండు కాదు!

అవకాడో ఆరోగ్యకరమైన, పోషకాలు అధికంగా ఉండే పండు. మార్కెట్లో దీని ధర చాలా ఎక్కువగా ఉంటుంది.

అవకాడోను క్రమం తప్పకుండా తీసుకుంటే, అది ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

అవకాడోలో K, C, B5, B6, E వంటి విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి.

అవకాడో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది.

గుండె సంబంధిత వ్యాధుల నుంచి రక్షిస్తుంది. అవకాడోలో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.

 బరువు తగ్గాలనుకునేవారికి చాలా బాగా ఉపయోగపడుతుంది.

అవకాడో రోగనిరోధక శక్తిని పెంచడంలో సాయపడుతుంది.

ఇందులో విటమిన్ ఇ, కెరోటనాయిడ్స్‌ ఉండటం వల్ల ఇది కంటి ఆరోగ్యానికి, చర్మానికి మేలు చేస్తుంది.