గంగవల్లి కూరను తీసుకోవడం  వల్ల కలిగే లాభాలేంటంటే..

 ఆహారంలో గంగవల్లి కూరను తీసుకోవడం వల్ల ఎముకలు, దంతాలు ఆరోగ్యంగా, దృఢంగా తయారవుతాయి.

గంగవల్లలో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

 రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలోనూ సహకరిస్తుంది.

గుండె ఆరోగ్యం కూడా కాపాడుతుంది.

 గంగవల్లి కూరలో విటమిన్ ఎ, బీటా కెరోటిన్ ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యంలో సహకరిస్తాయి.

 ఐరన్ అధికంగా ఉండే గంగవల్లి కూరను శీతాకాలంలో తీసుకోవడం వల్ల ఐరన్ లోపాన్ని అధిగమించవచ్చు.

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.