అన్నం తిన్న వెంటనే  ఈ పనులు చేస్తే.. ఇక అంతే

భోజనం చేసిన తర్వాత మన శరీరంలో జీర్ణక్రియ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. 

ఆ సమయంలో రక్త ప్రసరణ అధికంగా కడుపు భాగం వైపు కేంద్రీకృతమవుతుంది.

ఇక ఆయుర్వేదం ప్రకారం చూసుకుంటే.. 

తిన్న వెంటనే 10-15 నిమిషాల పాటు నడవడం, 5 నిమిషాల పాటు వజ్రాసనంలో కూర్చోవడం వల్ల జీర్ణశక్తి పెరిగి..

తీసుకున్న ఆహారం తర్వగా, సులభంగా జీర్ణం అవుతుంది అంటున్నారు.

భోజనం చేసిన తర్వాత కాసేపు నడవడం వల్ల.. గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు నయమవుతాయి.

భోజనం చేసిన వెంటనే కొన్ని పనులు చేయకూడదు. అవి జీర్ణ వ్యవస్థపై ఒత్తిడి తెచ్చి, ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. 

ముఖ్యంగా భోజనం చేసిన వెంటనే నిద్రపోవడం మానుకోవాలి.