21 రోజుల్లో బెల్లీ ఫ్యాట్ తగ్గించడానికి రోజువారీ ఎనిమిది అలవాట్లు..

పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రొటీన్లు వంటి పోషక పదార్థాలతో కూడిన సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు తీసుకోవడం వల్ల కడుపు నిండుగా అనిపిస్తుంది. ఇది అతిగా తినడాన్ని తగ్గిస్తుంది.

రోజంతా పుష్కలంగా నీరు తాగడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది. కేలరీలు బర్న్ అవుతాయి.

ఫుల్-షుగర్ సోడాలు ఇతర చక్కెర పానీయాలు కొవ్వును పెంచుతాయి. వీటిని పూర్తిగా మానేయడం మంచిది.

పరుగు, ఈత, సైక్లింగ్ వంటి ఏరోబిక్ వ్యాయామాలు కేలరీలను బర్న్ చేసి, మొత్తం శరీర కొవ్వును తగ్గిస్తాయి.

రోజుకు 6-8 గంటలు నిద్రపోవడం వల్ల శరీరంలోని హార్మోన్లు సమతుల్యంగా ఉండి, కొవ్వు పెరగడాన్ని నివారించవచ్చు.

అధిక ఒత్తిడి కార్టిసాల్ అనే హార్మోన్‌ను విడుదల చేస్తుంది. ఇది కొవ్వును పెంచుతుంది. ఒత్తిడిని తగ్గించడానికి ధ్యానం, యోగా వంటి పద్ధతులు పాటించండి.

క్రమం తప్పకుండా ఒకే సమయంలో భోజనం చేయడం వల్ల జీవక్రియ నియంత్రణలో ఉంటుంది. కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది.