అధిక ప్రోటీన్, మాంసాహార సూపర్‌ఫుడ్‌లు

చికెన్ బ్రెస్ట్ అధిక కొవ్వు లేకుండా ప్రోటీన్లతో నిండి ఉండి కండరాల నిర్మాణం, మరమ్మతుకు ఉపయోగపడుతుంది.

కోడి గుడ్డులోని ప్రోటీన్లు అమైనో ఆమ్లాలతో ఉండి కండరాల నిర్మాణానికి దోహదపడతాయి.

అలాగే లీన్ పంది నడుములో తక్కువ కొవ్వు, క్యాలరీలతో అధిక ప్రోటీన్ కల మాంసం ఉంటుంది.

 రొయ్యలలో కూడా క్యాలరీలు తక్కువగా, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి.

ఇంకా, ట్యూనా ఫిష్ ప్రోటీన్ సులభంగా లభించే అద్భుతమైన ఆహారం.

సాల్మన్ చేప ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలతో నిండి అధిక ప్రోటీన్లు కలిగి ఉంటుంది.