అలాగే పాలలోని లాక్టిక్ యాసిడ్ జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది.
ఈ పసుపు పాలు రోజూ నిద్రించే ముందు తాగడం ద్వారా యూరిక్ యాసిడ్ తొందరగా తగ్గుతుంది.
రాత్రి మెంతులను నానబెట్టి ఉదయం ఆ నీళ్లు తాగితే షుగర్ లెవెల్స్ అదుపులో ఉండి యూరిక్ యాసిడ్ లెవెల్స్ తగ్గుతాయి. అలాగే కీళ్లు బిగుతుగా మారకుండా ఈ డ్రింక్ సహాయపడుతుంది.
జీలకర్రలోని పోషకాలు జీర్ణశక్తిని మెరుగుపర్చి కిడ్నీల నుంచి పేరుకుపోయిన యూరిక్ యాసిడ్ ఫ్లష్ చేయడంలో సహాయపడతాయి. రోజూ ఓ కప్పు గోరువెచ్చని జీలకర్ర నీళ్లు తాగడం మంచిది.
సోరకాయ ముక్కలు, తులసి ఆకులు మిక్సీలో వేసి రసం తీయండి. దీనిని వడగట్టి ప్రతిరోజూ ఉదయం తాగడం ద్వారా శరీరం పూర్తిగా డీటాక్స్ అవుతుంది. యూరిక్ యాసిడ్ లెవెల్స్ తగ్గిపోతాయి. రుచికోసం కొద్దిగా రాతి ఉప్పు, జీలకర్ర పొడి వేసుకోవచ్చు.
వేడి నీటిలో నిమ్మరసం, తేనె కలిపి తాగితే చాలా మంచిది. ఇవి శరీరం నుంచి విష పదార్థాలను తొలగించడంలో సహాయపడతాయి. అలాగే కిడ్నీలను పనితీరును మెరుగుపర్చి యూరిక్ యాసిడ్ లెవెల్స్ తగ్గిస్తాయి
మునగాకు పొడిని గోరువెచ్చని నీళ్లలో వేసి అందులో కొద్దిగా నిమ్మరసం కలిపి ఉదయం పూట తాగండి. ఇలా చేయడం వల్ల షుగర్ తగ్గడమే కాకుండా యూరిక్ యాసిడ్ లెవెల్స్ కరిగిపోతాయి.