జిమ్‌కు వెళ్లేందుకు టైమ్ లేని వాళ్లు ఈ పది అలవాట్లతో కస్తరత్తులు లేకుండానే బరువుతగ్గొచ్చు

నిత్యం నీళ్లు తాగుతూ ఉంటే కడుపునిండుగా అనిపించి ఆహారం తినడం తగ్గుతుంది. ఫలితంగా బరువు కూడా తగ్గుతారు.

కొద్ది మొత్తాల్లో పలు విడతలుగా ఆహారం తీసుకుంటే కెలోరీలు తగ్గి బరువు నియంత్రణలో ఉంటుంది

కడుపు నిండుగా ఉండేందుకు, కండరాల శక్తి పెరిగేందుకు ఆహారంలో లీన్ ప్రొటీన్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి

సీజనల్ పండ్లు, ఆకుకూరలల్లో కెలొరీలు తక్కువగా, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. వీటితో బరువు సులువుగా తగ్గొచ్చు

సోడాలు, కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్, తీపి ఎక్కువ ఉన్న ఐస్డ్ టీలకు దూరంగా ఉండాలి.

ప్రాసెస్డ్ చిరుతిళ్లకు బదులు గింజలు విత్తనాలు అధికంగా తినడం అలవాటు చేసుకోవాలి

బరువు నియంత్రణకు నిద్ర ఎంతో అవసరం. కాబట్టి నిద్ర విషయంలో సమయపాలన పాటించడం అలవాటు చేసుకోవాలి

ఆహారం నెమ్మదిగా, బాగా నమిలి తినాలి. ఈ అలవాటుతో ఆహారం తీసుకోవడం తెలీకుండానే తగ్గిపోతుంది.

భోజనం చేసేటప్పుడు టీవీలు, స్మార్ట్ ఫోన్లు చూస్తే మనకు తెలీకుండానే ఆహారం ఎక్కువగా తింటాం. కాబట్టి, వీటికి దూరంగా ఉండాలి.