తెలంగాణలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు 2026, ఫిబ్రవరి 25 నుంచి ప్రారంభం కానున్నాయి.
25వ తేదీన ఫస్ట్ ఇయర్, 26వ తేదీ సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రారంభమవుతాయి.
సబ్జెక్టుల వారీగా పరీక్షల టైమ్ టేబుల్‌ను ఇంటర్ బోర్డు ఇటీవల విడుదల చేసింది.
ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రాత పరీక్షలు నిర్వహిస్తారు.
ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జరుగుతాయి.
ప్రతి రోజూ రెండు షిప్టుల్లో.. ఉదయం 9 నుంచి 12 గంటలు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఈ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తారు.
ఆంగ్లంలో ప్రాక్టికల్స్ (20 మార్కులకు).. ఫస్టియర్ విద్యార్థులకు జనవరి 21న..సెకండియర్‌కు 22వ తేదీన జరుగుతాయి.
ఫస్టియర్ విద్యార్థులకు జనవరి 24న పర్యావరణ విద్య పరీక్ష నిర్వహిస్తారు.
రాష్ట్రవ్యాప్తంగా రెండు సంవత్సరాలు కలిపి సుమారు 9.50 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నారు.
విద్యార్థులు ఆలస్య రుసుం లేకుండా నవంబర్ 1 నుంచి 14వ తేదీ వరకు ఈ పరీక్షల ఫీజు చెల్లించవచ్చు. తొలిసారిగా ఆంగ్లం ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్‌కు రూ. 100 పీజు వసూలు చేయాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది.
తొలి ఏడాది జనరల్ కోర్సుల విద్యార్థులు రూ. 630, ఫస్టియర్ ఒకేషన్ విద్యార్థులు రూ. 870 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
రెండో ఏడాది ఆర్ట్స్‌కు రూ. 630, రెండో ఏడాది సైన్స్, ఒకేషనల్ విద్యార్థులైతే రూ. 870 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.
ఇక రూ. 2 వేలు ఆలస్య రుసుంతో డిసెంబర్ 15వ తేదీ వరకు విద్యార్థులు ఫీజు చెల్లించే అవకాశాన్ని ఇంటర్ బోర్డు కల్పించింది.