అవినీతి సూచికలో భారత్ పరిస్థితి దారుణం..

అవినీతి అవగాహన సూచికలో 96కు పడిపోయిన భారత్ 

2024లో 180 దేశాలలో 96వ స్థానం దక్కించుకున్న భారత్

ఈ నివేదికలో మన కంటే మెరుగ్గా 76వ స్థానంలో ఉన్న చైనా

భారత్ పొరుగు దేశాలైన పాకిస్తాన్, శ్రీలంక 135, 121వ స్థానాలు కైవసం

2023లో ఈ సూచీలో భారతదేశం ర్యాంక్ 93

2024లో భారత్ మొత్తం స్కోరు 38 కాగా, 2023లో 39, 2022లో 40

దేశంలో అవినీతి ఇంకా ఆందోళన కలిగించే విధంగా ఉందని ఈ నివేదిక వెల్లడి

అవినీతి తక్కువగా ఉన్న దేశాల జాబితాలో డెన్మార్క్ అగ్రస్థానం

తర్వాత స్థానాల్లో ఫిన్లాండ్, సింగపూర్ ఉన్నాయన్న ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ నివేదిక

సున్నా ఉంటే అవినీతి ఎక్కువ, 100 స్కోర్ ఉంటే తక్కువ అవినీతి అని అర్థం

అవినీతి ఎక్కువ ఉన్న దేశాల్లో 180వ స్థానంలో సౌత్​ సూడాన్, 179వ స్థానంలో  సోమాలియా