మీ ప్రాంతంలో ఏ సిగ్నల్ ఉందో ఇలా ఈజీగా తెలుసుకోండి

జియో, ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ సంస్థలు తమ వెబ్‌సైట్‌లలో నెట్‌వర్క్‌ కవరేజీ మ్యాప్స్‌ను అందుబాటులోకి తెచ్చాయి

దీంతో మీరు ఉన్న ప్రాంతంలో ఏ టెలికాం నెట్‌వర్క్‌ సేవలు బాగా పనిచేస్తాయో తెలుసుకోవచ్చు

ట్రాయ్‌ ఆదేశాల మేరకు టెలికాం కంపెనీలు తమ వెబ్‌సైట్‌లపై కవరేజీ మ్యాప్‌లు అందించాయి

ఎయిర్‌టెల్‌ వినియోగదారులకు ‘చెక్‌ కవరేజీ’ ఫీచర్‌ ద్వారా వారి వెబ్‌సైట్‌లో చూపిస్తుంది

జియో ‘కవరేజీ మ్యాప్‌’ ఫీచర్ ద్వారా తన వెబ్‌సైట్‌లో ‘కవరేజీ మ్యాప్‌’ను ప్రవేశపెట్టింది

వొడాఫోన్‌ ఐడియా ‘నెట్‌వర్క్‌ కవరేజీ’ ఫీచర్‌ను వారి వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తెచ్చింది

ఎయిర్‌టెల్‌ 2G, 4G, 5G నెట్‌వర్క్‌ కవరేజీని ప్రదర్శిస్తుంది

జియో 4G, 5G నెట్‌వర్క్‌ సేవలు అందిస్తున్న ప్రదేశాలను చూపిస్తుంది

వొడాఫోన్‌ ఐడియా తన మ్యాప్‌లో 2G, 4G, 5G నెట్‌వర్క్‌ ప్రదేశాలను చూపిస్తుంది

ప్రస్తుతానికి బీఎస్‌ఎన్‌ఎల్‌ వెబ్‌సైట్‌లో ఈ కవరేజీ మ్యాప్స్‌ అందుబాటులో లేవు