అదిరిపోయే శుభవార్త.. రూ.55 వేలకు దిగిరానున్న బంగారం ధర..

బంగారం రేటు అంతర్జాతీయ పరిస్థితులు.. ముఖ్యంగా అమెరికా డాలర్ విలువ, ఫెడరల్ బ్యాంకు నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది.

మార్నింగ్‌స్టార్ నిపుణుడు జాన్ మిల్స్ అనే వ్యక్తి బంగారం ధరలపై ఆశావహంగా లేని అంచనాలను వెల్లడించాడు.

గత కొన్నాళ్లుగా బంగారం ధరలు రాకెట్ కన్నా వేగంగా దూసుకుపోతూ.. చుక్కలను తాకుతున్నాయి.

భవిష్యత్తులో బంగారం ధర భారీగా దిగి రానుందట. 10 గ్రాముల రేటు ఏకంగా 55 వేల రూపాయలకు పడిపోయే అవకాశం ఉందంటున్నారు.

దీర్ఘకాలికంగా చూస్తే మాత్రం బంగారం ధరలను దిగి వచ్చే అవకాశం ఉంది అంటున్నారు

 వాల్ స్ట్రీట్‌లో మాత్రం చాలా మంది పుత్తడి ధర మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. కానీ మిల్స్ మాత్రం దీనికి భిన్నమైన అభిప్రాయం వ్యక్తం చేశారు

ఈ వారం బంగారం అత్యధిక ధరను చేరుకున్నప్పటికీ.. రానున్న ఐదేళ్లలో అది 1,820 డాలర్లకు పడిపోవచ్చని మిల్స్ అంచనా వేశాడు.