Home » Videos
ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జన ఏర్పాట్లలో అధికారులు బిజీగా ఉన్నారు. నిర్దేశించిన మార్గంలో భారీ వినాయకులను తరలించాలని సూచించారు.
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ బాషాపై అత్యాచారం కేసు నమోదైంది. పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారంటూ ఓ యువతి ఫిర్యాదు చేయడంతో రాయదుర్గం స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ముంబయికి చెందిన నటి కాదంబరీ జత్వానీ అక్రమ అరెస్టు వ్యవహారంలో ముగ్గురు ఐపీఎస్ అధికారులపై ఏపీ ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. జగన్ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ డీజీ పిఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా, డిప్యూటీ పోలీస్ కమిషనర్ విశాల్ గున్నీలను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
అమెరికా: టెక్సాస్‌లో వినాయక నిమజ్జనం ఘనంగా జరిగింది. ‘వెళ్లి రావయ్య.. బొజ్జ గణపయ్య’ అంటూ టెక్సాస్‌లోని తెలుగువారు గణపతికి వీడ్కోలు పలికారు. ఈ వేడుకల్లో పెద్దలు, పిల్లలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. చిన్నారులు డ్యాన్సులు చేస్తూ సందడి చేశారు.
ఎన్టీఆర్ జిల్లా: చందర్లపాడు మండలంలో కూటమి నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు. తుర్లపాడులో వరదల కారణంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా కాపాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
అమరావతి: ఊహించిందే జరిగింది. గనులశాఖ మాజీ డైరెక్టర్ వెంకట్ రెడ్డి విదేశాలకు పరారయ్యారు. ఇసుక కాంట్రాక్టులో అవినీతి అక్రమాల కేసులో ఆయన కోసం ఏసీబీ గత రెండు, మూడు రోజులుగా గాలిస్తున్నా ఆచూకీ కనిపెట్టలేకపోయింది.
కర్నూలు జిల్లా: నంద్యాలలో మంత్రి ఎన్ఎండీ ఫరూక్ కుమారుడు.. టీడీపీ జిల్లా కార్యదర్శి ఫిరోజ్‌పై దాడి జరిగింది. కారులో వస్తుండగా నలుగురు యువకులు కారు అద్దాలు పగలగొట్టారు. దీంతో వెంటనే అప్రమత్తమైన ఫిరోజ్ కారు దిగి దుండగులను పట్టుకునేందుకు యత్నించారు.
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖలో విప్లవాత్మకమార్పులకు శ్రీకారం చుట్టింది. ప్రజారోగ్యాన్ని బలోపేతం చేసి సామాన్య ప్రజలకు ప్రభుత్వ వైద్యాన్ని మరింత చేరువ చేయాలని చూస్తోంది.
కృష్ణా జిల్లా: గన్నవరంలోని విజయవాడ ఎయిర్ పోర్టు ఇప్పుడు ప్రయాణీకులతో కలకలలాడుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రయాణీకుల సంఖ్య నెలకు లక్ష దాటిందని పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. ఎయిర్ పోర్టు అభివృద్ధిపైన ప్రత్యేక దృష్టి పెట్టారు.
విశాఖ: సముద్ర తీరంలో పెద్ద ప్రమాదం తప్పింది. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన బోటు ఇంజన్లో మంటలు చెలరేగి బోటు దగ్ధమైంది. ప్రమాద సమయంలో బోటులో ఐదుగురు మత్స్యకారులు ఉన్నట్లు సమాచారం. అదే సమయంలో మరో బోటులో మత్స్య కారులు తీరానికి చేరుకున్నారు.