‘క్షేమకుతూహలం’ పాకశాస్త్ర గ్రంథం ‘భైమి’ అనే హల్వా లాంటి ఈ పవిత్రాహారాన్ని పేర్కొంది. దీన్ని వండటానికి నాణ్యమైన గోధుమపిండి, చాలినంత నెయ్యి కావాలి. కొబ్బరి నీళ్లు లేదా కొబ్బరి తురుముని పిండి తీసిన కొబ్బరి పాలు సిద్ధంగా ఉంచుకోవాలి.
పప్పుధాన్యాల్లో పెసరపప్పునే తెలుగువారు మొదటగా రుచి చూశారని చరిత్ర. పెసర చేనునే ‘పైరు’ అన్నారు ఆ తర్వాత అన్ని పంట చేలనూ పైరు అనటం మొదలు పెట్టారు. పైరగాలి అంటే సాయంకాల సమయంలో వీచే తూర్పు గాలి.
నగరంలో దాదాపు అందరివీ బిజీ జీవితాలే. వారానికొకసారి కూరగాయలు తెచ్చుకోవడం వారాంతం వరకు ఫ్రిజ్‌లో దాచుకోవడం. ఉన్నవాటితోనే ఏదో వంటకాన్ని చేసేయడం చాలా మంది చేసే పనే.
ఉప్పుగాయ అంటే ‘సాల్టెడ్ ఫ్రూట్’ లేదా ‘పికిల్’ అని! ఉప్పులో ఊరవేసి ఎండించిన కాయ ఉప్పుగాయ. ‘‘లవణ భావిత చూతాది శలాటుః’’ అని దీనికి నిర్వచనం ఉంది. చూతాది శలాటువులంటే ముదురు మామిడి కాయల్లాంటివని! ఈ కాయలను తరిగి ఉప్పు చల్లి ఊరబెట్టినది ఉప్పుగాయ!
గోధుమపిండిలో ఉప్పు, నెయ్యి తగినంత కలిపి కొద్దిగా నీళ్లు పోసి, మెత్తగా మర్దించి మూతబెట్టి అరగంట పాటు పక్కన ఉంచండి! కొద్దిగా నెయ్యి వేసి వేగించిన శనగపిండిలో కోరిన మసాలా ద్రవ్యాలు, కొత్తిమీర, ఆవనూనె, నిమ్మరసం చాలినంత వేసి ముద్దగాచెయ్యండి.
కన్నడం వారికి ‘ఉప్పిట్టు’ తెలుగువాళ్ళకు ఉప్పిండి ప్రాచీన వంటకాలు. డి.ఇ.డి.ఆర్. నిఘంటువులో తమిళ ‘ఉవి’ అంటే, ఉడికించటం, ఉవియల్ = ఉడికించిన వంటకం, ఉవళం = ఉడికించిన బియ్యం అని అర్థాలు. తెలుగులో దీన్ని ‘ఉప్పు’ అని పిలుస్తాం. ఉప్పంటే లవణం అనే కాదు, ఉడికించిందనే అర్థం కూడా ఉంది.
‘‘...నిడ్డేనలు, గుడుములు, నప్పడంబులు, నిప్పట్లు, గొల్లెడలు, దోసియలు, సేవియ...’’ కాశీఖండంలో శ్రీనాథ మహాకవి ‘‘అనంత రంబా విశాలాక్షీ మహాదేవీ...’’ అంటూ మొదలుపెట్టి, వ్యాసుడికి, అతని శిష్యులకీ వడ్డించిన వంటకాల పట్టిక ఒకటి ఇచ్చాడు.
వర్షాకాలంలో విరివిగా దొరికే ఆకాకరకాయలను ఇష్టపడనివారు ఉండరు. వీటినే కొన్ని ప్రాంతాల్లో బోడ కాకరకాయలు, బొంత కాకరకాయలని కూడా పిలుస్తుంటారు. వీటితో వేపుడు, ఇగురు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇవికాక ఆకాకరకాయలతో తయారుచేసే విభిన్న వంటకాలు కూడా ఉన్నాయి.
వర్షాకాలంలో విరివిగా దొరికే ఆకాకరకాయలను ఇష్టపడనివారు ఉండరు. వీటినే కొన్ని ప్రాంతాల్లో బోడ కాకరకాయలు, బొంత కాకరకాయలని కూడా పిలుస్తుంటారు. వీటితో వేపుడు, ఇగురు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇవికాక ఆకాకరకాయలతో తయారుచేసే విభిన్న వంటకాలు కూడా ఉన్నాయి.
తెలుగులో కూడా పూరికలున్నాయి. కానీ, వ్యుత్పత్తి అర్థం వేరు. తెలుగులో పూరిక అంటే పొంగినదని! మూలద్రావిడ శబ్దం పూరి తెలుగులో బూర అయ్యింది. గాలి ఊదితే పొంగే బెలూనుని బూర అంటారు. బూరలా పొంగే వంటకాలు ప్రముఖంగా రెండున్నాయి.