Advertisement
Advertisement
Abn logo
Advertisement

జడ్పీటీసీలకు ఎలాంటి ఇబ్బంది కలగనివ్వను

అంబేడ్కర్‌ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న జడ్పీ చైర్‌పర్సన్‌ వెంకాయమ్మ, శివప్రసాద్‌రెడ్డి

జడ్పీ చైర్‌పర్సన్‌ వెంకాయమ్మ


ఒంగోలు(జడ్పీ), నవంబరు 26: జిల్లాలో ఉన్న జడ్పీ టీసీ సభ్యులకు నిబంధనలను  అనుసరించి ఎలాంటి ఇ బ్బంది కలగకుండా చూస్తానని జిల్లా పరిషత్‌ చైర్‌ప ర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ హామీ ఇచ్చారు. శుక్ర వారం ఒంగోలులోని కేబీ రెస్టారెంట్‌లో జడ్పీటీసీ సభ్యు లతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఆమె మా ట్లాడారు. ఆయా మండలపరిషత్‌ కార్యాలయాలలో  ప్ర త్యేకంగా జడ్పీటీసీలకు గదిని కేటాయించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. అవసరాన్ని బట్టి గదిని నిర్మించాల్సి వస్తే అందుకోసం జడ్పీ నిధులను కేటాయి స్తామన్నారు. త్వరలో జరగబోవు జడ్పీ సర్వసభ్యసమా వేశంలో అన్ని సమస్యలను పరిష్కరించే విధంగా కార్యా చరణ రూపొందిస్తామని చెప్పారు. అనంతరం రాజ్యాం గ ఆమోద దినోత్సవాన్ని పురస్కరించుకుని అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కా ర్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్‌పర్సన్లు అరుణ, సజ్ఞానమ్మ, జడ్పీ టీసీ సభ్యులు పాల్గొన్నారు.


Advertisement
Advertisement