రెండేళ్లయినా బిల్లులు రాలేదు..

ABN , First Publish Date - 2022-06-25T05:50:38+05:30 IST

గ్రామాల్లో రహదారులు, ఉపాధి హామీ, సచివాలయాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, పంచాయతీ కార్యాలయాలు, ఆర్‌బీకేలుు, లింకురోడ్లు, పూర్తిచేసిన వారికి రెండేళ్లుగా బిల్లులు ఇవ్వటం లేదని పలువురు జడ్పీటీసీలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

రెండేళ్లయినా బిల్లులు రాలేదు..
సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ లక్ష్మణరావు, జడ్‌ పి చైర్‌పర్సన్‌ క్రిస్టిన తదితరులు

స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో జడ్పీటీసీల ఆగ్రహం

గుంటూరు, జూన్‌ 24(ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో రహదారులు, ఉపాధి హామీ, సచివాలయాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, పంచాయతీ కార్యాలయాలు, ఆర్‌బీకేలుు, లింకురోడ్లు, పూర్తిచేసిన వారికి రెండేళ్లుగా బిల్లులు ఇవ్వటం లేదని పలువురు జడ్పీటీసీలు  అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జడ్పీ కార్యాలయంలో శుక్రవారం చైర్‌పర్సన్‌ కత్తెర హెనీ క్రిస్టినా అధ్యక్షతన స్టాండింగ్‌ కమిటీ సమావేశాలను  నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీటీసీలు పి.చిట్టిబాబు, కాట్రగడ్డ మస్తాన్‌రావు మాట్లాడుతూ ఇంజనీరింగ్‌ అధికారులు బిల్లులు విడుదల చేశాం, సీఎఫ్‌ఎంఎస్‌లో ఉన్నట్లు చెబుతున్నారని అన్నారు. సాంకేతికపరమైన సమస్య ఉందని మభ్యపెడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో సకాలంలో పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయాలని ఎమ్మెల్సీ లక్ష్మణరావు కోరారు. పొన్నూరు ఎమ్మెల్యే కిలారు రోశయ్య మాట్లాడుతూ వడ్లమూడి క్వారీలలో మంచినీటి టాంక్‌ను ఏర్పాటు చేయటానికి సాంకేతిక అంశాలను పరిశీలించాలన్నారు. ఆర్‌బీకేలలో రైతులకు అవసరమైన పత్తి విత్తనాలు అందుబాటులో లేవని జడ్పీటీసీలు అధికారులపై ధ్వజమెత్తారు. వైస్‌ చైర్మన్‌ నర్శిరెడ్డి మాట్లాడుతూ ప్రత్తివిత్తనాలను ఎక్కువ ధరలకు అమ్మేవారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో సీఈవో డాక్టర్‌ శ్రీనివాసరెడ్డి, వివిధ శాఖల అధికారులు, వె ౖస్‌ చైర్మన్‌ బత్తుల అనురాధ తదితరులు పాల్గొన్నారు.

 

Updated Date - 2022-06-25T05:50:38+05:30 IST