జడ్పీలో నియంత!

ABN , First Publish Date - 2021-04-15T05:49:42+05:30 IST

జడ్పీలో ఓ ఉన్నతాధికారి నియంతలా వ్యవహరిస్తున్నారన్న ఆ రోపణలు గుప్పుమంటున్నాయి. అనుకూలురు, అ యినవాళ్లు అయితే.. అక్రమాలకు పాల్పడినా.. చర్యలుండవట. పైగా అందలం ఎక్కిస్తారని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి.

జడ్పీలో నియంత!

సిబ్బందిపై ద్వంద్వ నీతి..!

అయినోళ్లు, అనుకూలురు 

అక్రమార్కులైనా అందలం..

కానివారికి దూరప్రాంతాలకు 

బదిలీ బహుమానాలు..

అనంతపురం విద్య, ఏప్రిల్‌ 14:  జడ్పీలో ఓ ఉన్నతాధికారి నియంతలా వ్యవహరిస్తున్నారన్న ఆ రోపణలు గుప్పుమంటున్నాయి. అనుకూలురు, అ యినవాళ్లు అయితే.. అక్రమాలకు పాల్పడినా.. చర్యలుండవట. పైగా అందలం ఎక్కిస్తారని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. తన అక్రమాలకు సహకరించకపోయినా.. అనుకూలంగా నడుచుకోకపోయినా.. దూరప్రాంతాలకు బదిలీ బహుమానంగా ఇస్తారన్న విమర్శలు బహిరంగంగానే వ్యక్తమవుతున్నాయి. గత రెండున్నరేళ్లలో 7 నుంచి 10 మంది సిబ్బందిని జిల్లా సరిహద్దు ప్రాంతాలకు బదిలీ చేయటమే ఇందుకు నిదర్శనం. దీంతో ఉన్నతాధికారి తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

‘మనవారైతే.. చాలు. ఏదీ ఎదురుచెప్పకుండా వినా లి. తల ఊపుతూ... అక్రమమైనా చేసేయాలి.’ ఇ లాంటి వారైతే ఓకే. ఎక్కడున్నా మన వద్దకు తె చ్చుకుందాం. మనల్నే ప్రశ్నిస్తాడా.. రూల్స్‌ మాట్లా డే స్థితికి వచ్చారంటే.. ఇక వద్దు. పాలనా సౌలభ్యం (అడ్మినిస్ట్రేటివ్‌ గ్రౌండ్స్‌) కింద సుదూర ప్రాంతానికి బదిలీల చేసేద్దాం.’ ఇదీ జడ్పీలో సాగుతున్న తం తు. అయినవాళ్లయితే... ఎన్ని తప్పులు చేసినా చర్యలుండవు. కానివారైతే.. రోజల వ్యవధిలోనే సస్పెండ్‌ చేస్తారు. మాట వినని వారిని జిల్లా సరిహద్దు ప్రాంతాలకు విసిరేస్తారు.


నచ్చిందే చేస్తాం..

జడ్పీలో ఓ ఉన్నతాధికారి తనకు నచ్చిందే చేస్తామ న్న ధోరణిలో వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉరవకొండ ఎంపీడీఓ కార్యాలయంలో పనిచేసే  ఓ జూనియర్‌ అసిస్టెంట్‌ను అ క్కడి ఎంపీడీఓ ఈనెల 6న జిల్లా పరిషతకు స రెండర్‌ చేశారు. విధుల పట్ల నిర్లక్షం, ఎన్నికల విధులకు గైర్హాజరయ్యారంటూ సదరు ఉద్యోగిని సరెండర్‌ చేశారు. ‘గతంలో సదరు ఉద్యోగికి అనేక మెమోలు ఇచ్చాం. ఆయన వ్యవహార శైలిపై నివేది క కూడా సమర్పించాం. అయినా మీరు చర్యలు తీసుకోలేదు. ఇటీవల ఆయనకు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోస్టల్‌ బ్యాలెట్ల పంపిణీ బాధ్యతను అప్పగించినా.. పూర్తిగా పనిచేయలేదు. అందుకే జ డ్పీకి సరెండర్‌ చేస్తున్నాం’ అంటూ ఎంపీడీఓ ఇచ్చి న ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయినా.. ఆయనపై జ డ్పీ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపోవడంపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. సరెండర్‌ అ యిన జూనియర్‌ అసిస్టెంట్‌ ఓ ఈఓఆర్డీకి స్వ యానా తమ్ముడు కావడం, ఆ ఈఓఆర్డీ జడ్పీలోని ఓ ఉన్నతాధికారికి దగ్గరి అధికారి కావడం ఇందుకు కారణాలన్న వాదనలు వినిపిస్తున్నాయి. పామిడి ఎంపీడీఓ కార్యాలయంలో పనిచేసే సీనియర్‌ అసిస్టెంట్‌పై విమర్శలు, ఆరోపణలు వచ్చాయంటూ ఈనెల 7వ తేదీన సస్పెండ్‌ చేశారు. ఆఫీ్‌సలో తోటి మహిళా సిబ్బందితో దురుసుగా ప్ర వర్తించాడంటూ, మరికొందరిపై దాడి చేశాడంటూ స్థానిక ఎంపీడీఓ ఇచ్చిన రిపోర్టు మేరకు ఆయనను సస్పెండ్‌ చేశారు. జూనియర్‌ అసిస్టెంట్‌పై చర్యలు ఎందుకు తీసుకోరో.. అర్థం కావట్లేదు. జడ్పీలోని ఓ ఉన్నతాధికారి ఒక్కొక్కరి పట్ల ఒక్కో రకం గా వ్యవహరిస్తుండటంపై ఆరోపణలు వస్తున్నాయి.


అడ్డుచెబితే.. వేటే..

గత రెండున్నరేళ్లలో 7 నుంచి 10 మంది వరకూ సిబ్బందిని జిల్లా సరిహద్దు ప్రాంతాలకు బదిలీ చేసినట్లు సమాచారం. తనకు కానివారికి మిత్రులు గా మసలుతున్నా... తనకు నచ్చకున్నా, తన మాట వినకున్నా... ఇక వారికి బదిలీ బహుమానంగా ఇచ్చేస్తారని ఆ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇలా జూనియర్‌, సీనియర్‌ అసిస్టెంట్లను సుదూర ప్రాంతాలకు పాలనా సౌలభ్యం కింద ట్రాన్స్‌ఫర్‌ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమకు సీట్లు మార్చండి అంటూ పలువురు విన్నవించినా.. వేడుకున్నా.. వినరు. తనకు అనుకూలంగా వ్యవహరించే ఉద్యోగులకు మాత్రం ఏ సీటు అడిగితే... అది కేటాయిస్తారన్న ఆరోపణలున్నాయి. ఇదీ జడ్పీలోని ఓ ఉన్నతాధికారి వైఖరి. అక్రమార్కులైనా అందలం ఎక్కించటం.. కానివారు కష్టపడేవారైనా.. తొక్కేస్తుండటంపై విమర్శలు వస్తున్నాయి.



Updated Date - 2021-04-15T05:49:42+05:30 IST