ఫుడ్ ఆర్డర్ చేసిన 10 నిమిషాల్లోనే Zomato డెలివరీ

ABN , First Publish Date - 2022-03-22T13:56:46+05:30 IST

దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఫుడ్ డెలివరీ అప్లికేషన్‌లలో ఒకటైన జొమాటో ఆహార ప్రియుల కోసం కేవలం 10 నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ చేస్తామని ప్రకటించింది....

ఫుడ్ ఆర్డర్ చేసిన 10 నిమిషాల్లోనే Zomato డెలివరీ

న్యూఢిల్లీ: దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఫుడ్ డెలివరీ అప్లికేషన్‌లలో ఒకటైన జొమాటో ఆహార ప్రియుల కోసం కేవలం 10 నిమిషాల్లోనే  ఫుడ్ డెలివరీ చేస్తామని ప్రకటించింది. జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ మరో త్వరిత డెలివరీ సేవను ట్విట్టరులో ప్రకటించారు. ‘‘జొమాటోలో త్వరలో 10 నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ రాబోతోంది’’ అని గోయల్ ట్వీట్ చేశారు. ప్రపంచంలో ఇప్పటి వరకు ఏ కంపెనీ ఫుడ్‌ డెలివరీ సంస్థ 10 నిమిషాల్లోపు తాజా ఆహారాన్ని డెలివరీ చేయలేదు. కేవలం పది నిమిషాల్లో వేడి వేడి, తాజా ఆహారాన్ని అందించే సంస్థగా జొమాటో రికార్డులు క్రియేట్‌ చేయనుందని జొమాటో సీఈవో దీపిందర్‌ గోయల్‌ వెల్లడించారు.


ఆహారాన్ని వేగంగా డెలివరీ చేసేందుకు జొమాటో డెలివరీ భాగస్వాములపై ​​ఎలాంటి ఒత్తిడి చేయదని గోయల్ స్పష్టం చేశారు.వచ్చే నెల నుంచి గురుగ్రామ్‌లోని నాలుగు స్టేషన్‌లతో జొమాటో ఇన్‌స్టంట్ ప్రారంభం కానుంది.


Updated Date - 2022-03-22T13:56:46+05:30 IST