Sita Ramam: సీతా మహాలక్ష్మి లవ్ లెటర్లను కాపీ కొట్టిన జొమాటో.. నెటిజన్ల రియాక్షన్ ఏంటంటే..

ABN , First Publish Date - 2022-09-18T14:13:55+05:30 IST

దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్.. జంటగా నటించిన మూవీ ‘సీతా రామం’ ప్రేక్షకుల మనసు దోచుకుంది. బాక్సాఫిస్ వద్ద బిగ్గెస్ట్ హిట్ సాధించింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే.. ఇప్పుడు ఈ సినిమా ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. ‘సీ

Sita Ramam: సీతా మహాలక్ష్మి లవ్ లెటర్లను కాపీ కొట్టిన జొమాటో.. నెటిజన్ల రియాక్షన్ ఏంటంటే..

ఇంటర్నెట్ డెస్క్: దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్.. జంటగా నటించిన మూవీ ‘సీతా రామం’ ప్రేక్షకుల మనసు దోచుకుంది. బాక్సాఫిస్ వద్ద బిగ్గెస్ట్ హిట్ సాధించింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే.. ఇప్పుడు ఈ సినిమా ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. ‘సీతా రామం’(Sita Ramam) మూవీని ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో(Zomato) ఫాలో అవుతోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకూ విషయం ఏంటంటే..


కాశ్మీర్‌లోని మంచు కొండల్లో.. ఎముకలు కొరకే చలిలో విధులు నిర్వర్తిస్తున్న రామ్‌కు.. తన ప్రేమలేఖలతో సీతా మహాలక్ష్మి వెచ్చదనాన్ని అందిస్తుంది. సినిమాలో సీతా మహాలక్ష్మి రాసే లవ్ లెటర్లు ఒక్క రామ్‌నే కట్టిపడేయలేదు.. సినిమా చూసే ప్రతి ఒక్కరినీ చూపు తిప్పుకోకుండా చేశాయి. అయితే.. ఇప్పుడు జొమాటో కూడా ఇదే స్టైల్‌ను ఫాలో అవుతోంది. ‘సీతా రామం’ సినిమాలో రామ్‌కు సీతా మహాలక్ష్మి రాసిన పద్ధతిలో తన యూజర్లకు జొమాటో(Zomato) నోటిఫికేషన్లను పంపుతోంది. ‘డియర్ రీడర్, ఎలా ఉన్నారు?’ అని మొదలు పెట్టి.. సీతా మహాలక్ష్మి రాసిన లవ్ లెటర్ స్టైల్‌లో ఆకలిగా ఉంటే జొమాటో ఆర్డర్ పెట్టండన్నట్టు నోటిఫికేషన్లు పంపిస్తోంది.  






అవి చూసి యూజర్లు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. ‘సినిమాలో సీతా మహాలక్ష్మి రామ్‌కు లేఖలు రాసింది. కానీ నిజ జీవితంలో జొమాటో నాకు లెటర్ రాసింది’ అని పేర్కొంటూ తనకు వచ్చిన నోటిఫికేషన్‌కు సంబంధించిన స్ర్కీన్ షాట్‌ను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దీంతో ఇతర నెటిజన్లు కూడా తమకు వచ్చిన నోటిఫికేషన్ల వివరాలను కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు. ఏది ఏమైనా జొమాటో.. తన బిజినెస్ పెంచుకోవడానికి సీతా మహాలక్ష్మి(Sita Ramam) రాసిన లెటర్‌ను కాపీ కొట్టింది.

Updated Date - 2022-09-18T14:13:55+05:30 IST