త్వరలో జైడస్‌ క్యాడిలా టీకా!

ABN , First Publish Date - 2021-06-19T07:06:37+05:30 IST

వ్యాక్సిన్‌ కొరతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు శుభవార్త. కొరతను తీర్చేలా త్వరలో మరో టీకా అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అహ్మదాబాద్‌కు చెందిన జైడస్‌

త్వరలో జైడస్‌ క్యాడిలా టీకా!

అత్యవసర వినియోగ అనుమతి కోసం

వారం, పది రోజుల్లో డీసీజీఐకి దరఖాస్తు

ప్రపంచంలోనే తొలి డీఎన్‌ఏ కరోనా వ్యాక్సిన్‌


న్యూఢిల్లీ, జూన్‌ 18: వ్యాక్సిన్‌ కొరతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు శుభవార్త. కొరతను తీర్చేలా త్వరలో మరో టీకా అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అహ్మదాబాద్‌కు చెందిన జైడస్‌ క్యాడిలా సంస్థ.. తాను అభివృద్ధి చేసిన జై కొవ్‌-డి టీకా అత్యవసర వినియోగ అనుమతి కోసం వారం, పదిరోజుల్లో డీసీజీఐకి దరఖాస్తు చేసుకోనుంది. ఈ విషయాన్ని జైడస్‌ క్యాడిలా కేంద్రానికి తెలియజేసినట్టు సమాచారం. ఈ టీకాతో ఫేజ్‌-3 క్లినికల్‌ ట్రయల్స్‌ ఇటీవలే ముగిశాయి. కాగా.. నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకేపాల్‌ చెబుతూ ఇది చాలా ప్రత్యేకమైనదని, కరోనాకు తొలి డీఎన్‌ఏ వ్యాక్సిన్‌ అని వివరించారు. ఇప్పటిదాకా అందుబాటులో ఉన్నవి.. వైరల్‌ వెక్టర్‌ టీకాలు, హోల్‌ విరియన్‌ ఇన్‌-యాక్టివేటెడ్‌ వెరోసెల్‌ టీకా, ఎంఆర్‌ఎన్‌ఏ టీకాలు మాత్రమే.


నోవావాక్స్‌ తయారుచేసిన ‘ప్రొటీన్‌ ఆధారిత’ టీకా త్వరలో అందుబాటులోకి రానుంది. ఇక క్యాడిలా అభివృద్ధి చేసింది డీఎన్‌ఏ టీకా. అంటే.. వైర్‌సకు సంబంధించిన జన్యుకోడ్‌ను మన శరీరంలోకి తీసుకెళ్లే టీకా ఇది. ఆ కోడ్‌ను మన కణాల్లోని యంత్రాంగమే డీకోడ్‌ చేసి యాంటీజెన్‌లను ఉత్పత్తి చేస్తాయి.డీఎన్‌ఏ వ్యాక్సిన్‌ను ఇచ్చినప్పుడు అందులోని జెనెటిక్‌ కోడ్‌ మన శరీరంలోని మెసెంజర్‌ ఆర్‌ఎన్‌ఏలోకి వెళ్లాల్సిందే. అదే ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్‌ అయితే నేరుగా సింఽథటిక్‌ మెసెంజర్‌ ఆర్‌ఎన్‌ఏనే శరీరంలోకి ప్రవేశపెడతారు. ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్‌తో పోలిస్తే డీఎన్‌ఏ వ్యాక్సిన్‌ కొంతవరకూ స్థిరంగా పనిచేస్తుందంటారు.

Updated Date - 2021-06-19T07:06:37+05:30 IST