చిత్తూరు జిల్లా /ఐరాల : రోడ్డు ప్రమాదంలో పూతలపట్టు ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబు సహాయకుడు గుర్రప్ప(36) మంగళవారం మృతి చెందారు. ముఖ్యమంత్రి జగన్ జన్మ వేడుకలలో పాల్గొన్న ఆయన సాయంత్రం కుళ్లంపల్లెలోని తన ఇంటికి ద్విచక్ర వాహనంలో వెళుతుండగా ఐరాలకు సమీపంలోని నగరి వద్ద ఎదురుగా వస్తున్న గుర్తుతెలియని వాహనం ఢీకొంది. తీవ్రంగా గాయపడిన అతన్ని స్థానికులు చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెతిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నట్లు సమాచారం. ఈ ఘటనపై రాత్రి వరకు ఫిర్యాదు అందలేదని ఎస్ఐ హరిప్రసాద్ చెప్పారు. ఫిర్యాదు అందగానే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఆయన చెప్పారు. గుర్రప్ప మృతి విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబు చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి చేరుకుని పరిశీలించారు. గుర్రప్ప మృతి మృతికి ఎమ్మెల్యే, వైసీపీ మండల అధ్యక్షుడు చంద్రశేఖరరెడ్డి సానుభూతి తెలిపారు.