వైఎస్సార్‌ జలకళను సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2020-10-01T07:59:00+05:30 IST

చిన్న,సన్నకారు రైతులకు ఉపయోగకరంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైఎస్సార్‌ జలకళ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కడియం విశాల

వైఎస్సార్‌ జలకళను  సద్వినియోగం చేసుకోవాలి

కడియం, సెప్టెంబరు 30: చిన్న,సన్నకారు రైతులకు ఉపయోగకరంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైఎస్సార్‌ జలకళ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కడియం విశాల సహకార పరపతి సంఘం త్రిసభ్య కమిటీ చైర్‌పర్సన్‌ గిరజాల బాబు పేర్కొన్నారు. బుధవారం కడియం విశాల సహకార పరపతి సంఘంలో జరిగిన మహాజన సభలో ఆయన మాట్లాడుతూ సంఘ అభివృద్ధికి సభ్యులు కృషి చేయాలని కోరారు.


సకాలంలో రుణాలు చెల్లించిన రైతులకు 2017-2018 గాను వడ్డీ రాయితీ 229 మందికి రూ.1,45,360 వచ్చిందన్నారు. కౌలురైతులు సీసీఆర్‌సీ లేనివారికి జేపీబీ గ్రూపు కింద రుణాలు మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. కరోనా బారిన పడి మృతిచెందిన రైతులకు సంతాపం తెలిపారు. సమావేశంలో పర్సన్‌ వనుం పుత్రయ్య, ఉప్పులూరి హనుమంతరావు, సంఘ సభ్యులు, సీఈవో ఎస్‌ అప్పారావు, వ్యవసాయశాఖ సహాయకులు ఏశివశంకర్‌, రైతులు పాల్గొన్నారు.


Updated Date - 2020-10-01T07:59:00+05:30 IST