వై.పాలెం అసెంబ్లీ అభ్యర్థి ఎరిక్షన్‌బాబే!

ABN , First Publish Date - 2021-07-25T05:30:00+05:30 IST

పార్టీ నిర్మాణ వ్యవహారాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పాలని టీడీపీ అధిష్ఠానం నిర్ణయించుకుంది. ఎప్పుడు ఎక్కడ సమస్యలొచ్చినా గతంలో వలే నాన్చకుండా వేగంగా తుది నిర్ణయం తీసుకుంటోంది. అందులో భాగంగానే ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికలలో పోటీచేసే టీడీపీ అభ్యర్థి ఎరిక్షన్‌బాబే అని ప్రకటించింది. గత సాధారణ ఎన్నికలు ముగిసినప్పటి నుంచి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కూడా లేకపోవడంతో ఎర్రగొండపాలెంలో పార్టీకి దిక్కులోకుండా పోయింది. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ తదితరులు దృష్టి సారించి ఎరిక్షన్‌బాబుకి నియోజకవర్గ పార్టీ పగ్గాలు అప్పజెప్పారు.

వై.పాలెం అసెంబ్లీ అభ్యర్థి ఎరిక్షన్‌బాబే!
పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో జనార్దన్‌రెడ్డి



తేల్చిచెప్పిన టీడీపీ అధిష్ఠానం

నాన్చుడు ధోరణి ఉండదని స్పష్టం

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

పార్టీ నిర్మాణ వ్యవహారాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పాలని టీడీపీ అధిష్ఠానం నిర్ణయించుకుంది. ఎప్పుడు ఎక్కడ సమస్యలొచ్చినా గతంలో వలే నాన్చకుండా వేగంగా తుది నిర్ణయం తీసుకుంటోంది. అందులో భాగంగానే ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికలలో పోటీచేసే టీడీపీ అభ్యర్థి ఎరిక్షన్‌బాబే అని  ప్రకటించింది. గత సాధారణ ఎన్నికలు ముగిసినప్పటి నుంచి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కూడా లేకపోవడంతో ఎర్రగొండపాలెంలో పార్టీకి దిక్కులోకుండా పోయింది. ఈ నేపథ్యంలో  పార్టీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ తదితరులు దృష్టి సారించి ఎరిక్షన్‌బాబుకి నియోజకవర్గ పార్టీ పగ్గాలు అప్పజెప్పారు. తదనుగుణంగా  ఎరిక్షన్‌బాబు రంగంలోకి దిగారు. నెల రోజులుగా కార్యక్రమాల జోరు పెంచారు. నియోజకవర్గంలో 87 పంచాయతీలుండగా ఒక్క దానికి కూడా పార్టీ కమిటీ ఏర్పాటు కాలేదు. ఈనెల 1 నుంచి గ్రామాలవారీ పర్యటిస్తున్న ఎరిక్షన్‌ ఇప్పటికే 36 గ్రామాలకు పార్టీ కమిటీలు ఏర్పాటు చేశారు. మేడపిలో టీడీపీ సానుభూతిపరులైన 40మందికి వృద్ధాప్య ఫించన్లు ఆపేస్తే ఉన్నతాధికారులపై ఒత్తిడి పెంచి వాటిని పునరుద్ధరింపజేశారు. ఒక గ్రామంలో చేపలు పట్టుకునేందుకు సాగుకి అవసరమైన నీటిని బయటకు తోడేస్తుంటే జిల్లా అధికారులతో మాట్లాడి వాటికి అడ్డుకట్ట వేయించారు. ఈ నేపథ్యంలో గత ఎన్నికల్లో టీడీపీ పక్షాన పోటీచేసి ఓడిపోయిన మహిళా అభ్యర్థిని భర్త ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు. మళ్లీ టిక్కెట్‌ మాకే వస్తుందంటూ ఎరిక్షన్‌బాబు తాత్కాలికమేనని చెప్పటం ప్రారంభించారు. విషయం తెలుసుకున్న అధినేత చంద్రబాబు ఆగమేఘాలపై అవసరమైన సమాచారాన్ని తెప్పించుకుని సమస్యకు ఫుల్‌స్టాప్‌ పెట్టారు. వారం క్రితం ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గ పరిశీలకుడైన కర్నూలు జిల్లాకు చెందిన బీసీ జనార్దన్‌రెడ్డిని పిలిపించుకుని వెంటనే ఎర్రగొండపాలెం వెళ్లి ఎరిక్షన్‌బాబే కాబోయే మన అభ్యర్థి అన్న విషయాన్ని ప్రకటించాలని ఆదేశించారు. ఆయన రావటంలో జాప్యం జరగటంతో రెండురోజుల క్రితం మళ్లీ చంద్రబాబు ఫోన్‌చేసి ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించినట్లు తెలిసింది. దీంతో జనార్దన్‌రెడ్డి ఆదివారం నియోజకవర్గానికి వచ్చారు. పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన చంద్రబాబు మాటగా, పార్టీ అధిష్ఠానం నిర్ణయంగా ఎరిక్షన్‌బాబుని వచ్చే ఎన్నికల్లో అభ్యర్థిగా ప్రకటించి పార్టీ శ్రేణులంతా ఆయన బాటలో నడవాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. 

Updated Date - 2021-07-25T05:30:00+05:30 IST