Advertisement
Advertisement
Abn logo
Advertisement

అంగ వైకల్యం నైపుణ్యానికి కాదు: యాక్సిస్ బ్యాంక్ ఫౌండేషన్ సిఈఓ

హైదరాబాద్: అంగ వైకల్యం అనేది శరీరానికే కానీ మనసుకి, నైపుణ్యానికి కాదని యాక్సిస్ బ్యాంక్ ఫౌండేషన్ సిఈఓ ధ్రువీ షా అన్నారు. దక్షిణ పూర్వ ఆసియాలో అతి పెద్ద స్వచ్ఛంద సంస్థ అయిన యూత్ ఫర్ జాబ్స్ జూమ్ ద్వారా నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. కోవిడ్ వికలాంగుల స్ఫూర్తిదాయకమైన నిజ జీవిత గాథలు అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. కోవిడ్ కష్ట కాలంలో యూత్ ఫర్ జాబ్స్ సంస్థ ద్వారా శిక్షణ తీసుకొని విజయవంతంగా ఉద్యోగాలలో స్థిరపడిన వికలాంగుల కధలను ఈ పుస్తకంలో పొందుపరిచారు. జాతీయ స్థాయి వికలాంగ పూర్వ విద్యార్థుల సంఘాన్ని కూడా ఈ వేదికగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అమెజాన్ డైరెక్టర్ మీరా నారాయణన్, రస్నా, సిఐఐ చైర్మన్ పిరుజ్ ఖంబట్ట ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 200 మంది యువతీయువకులు, దివ్యాంగ యువత తలిదండ్రులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement