లాక్‌డౌన్ వేళ.. రాజధానిలో యువకుడిని కొట్టి.. మూత్రం తాపించిన పోలీసులు

ABN , First Publish Date - 2020-04-01T04:17:29+05:30 IST

కరోనా మహమ్మారిని నియంత్రించడానికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే.

లాక్‌డౌన్ వేళ.. రాజధానిలో యువకుడిని కొట్టి.. మూత్రం తాపించిన పోలీసులు

రాంచీ: కరోనా మహమ్మారిని నియంత్రించడానికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో కూడా రోట్లపై తిరుగుతున్న వారిపై పలుప్రాంతాల్లో పోలీసులు లాఠీలు ఝుళిపిస్తున్నారు. అయితే మంగళవారమే తొలి కరోనా కేసు నమోదు చేసుకున్న జార్ఖండ్‌లో పోలీసులు హద్దుమీరి ప్రవర్తించారు. రాష్ట్ర రాజధాని రాంచీలో రోడ్డుపైకి వచ్చిన ఓ యువకుడిని చావబాదారు. ఆపై బలవంతంగా ఆ యువకుడితో మూత్రం తాపించారు. హిందిపిరి ప్రాంతంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వెలుగుచూసింది. ఆ వీడియోలు తనను క్షమించాలని ఆ యువకుడు వేడుకుంటున్నాడు. ఈ విషయం తెలుసుకున్న డీఎస్పీ.. ఆ పోలీసులను సస్పెండ్ చేశారు. అలాగే ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించారు.

Updated Date - 2020-04-01T04:17:29+05:30 IST