జాతీయ భద్రతని ప్రభావితం చేస్తుంది: Agnipathపై Mayawati

ABN , First Publish Date - 2022-06-20T00:47:58+05:30 IST

అగ్నిపథ్ పథకం(Agnipath scheme)పై కేంద్రం మరోసారి ఆలోచించాలని బహుజన్ సమాజ్ పార్టీ(Bahujan Samaj Party) అధినేత మాయావతి(Mayawati) కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయమై పార్లమెంట్‌‌ను విశ్వాసంలోకి..

జాతీయ భద్రతని ప్రభావితం చేస్తుంది: Agnipathపై Mayawati

న్యూఢిల్లీ: అగ్నిపథ్ పథకం(Agnipath scheme)పై కేంద్రం మరోసారి ఆలోచించాలని బహుజన్ సమాజ్ పార్టీ(Bahujan Samaj Party) అధినేత మాయావతి(Mayawati) కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయమై పార్లమెంట్‌‌ను విశ్వాసంలోకి తీసుకోవాలని ఆమె అన్నారు. అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వస్తున్న నేపథ్యంలో ఆదివారం మాయావతి స్పందిస్తూ.. ‘‘దేశంలోని యువత ఇప్పటికే ద్రవ్యోల్బణం, పేదరికం వంటి సమస్యలతో ఉంటే అగ్నిపథ్ పథకం ఏమాత్రం ఆశాజనంగా లేదు. ఈ పథకంతో యువత అత్యంత అసంతృప్తితో ఉన్నారు. ఈ పథకంపై పునరాలోచించాలని కేంద్ర ప్రభుత్వాన్ని నేను అభ్యర్థిస్తున్నాను. ఈ అంశాన్ని పార్లమెంట్ విశ్వాసంలో తీసుకోవాలి. అలాగే యువత సంయమనం పాటించాలని నేను విజ్ణప్తి చేస్తున్నాను. రైల్వే, పారామిలిటరీ, ఆర్మీ నియామకాలను అతి తక్కువ కాలానికి పరిమితం చేయడం వల్ల గ్రామీణ యువత మోసపోయినట్లు భావిస్తున్నారు. తమ అవకాశాలపై వారికి స్పష్టత లేదు. అందుకే ఇంత పెద్ద ఎత్తున నిరసన చేస్తున్నారు. దీన్ని కేంద్ర ప్రభుత్వం సరి చేసుకోవాలి’’ అని మాయావతి అన్నారు.

Updated Date - 2022-06-20T00:47:58+05:30 IST