ఆ బాలిక ఇంటర్మీడియెట్ చదువుతోంది.. ఆమెతో కొన్ని రోజుల క్రితం ఓ యువకుడు పరిచయం పెంచుకున్నాడు.. ప్రేమ పేరుతో ఆమెను ట్రాప్ చేశాడు.. చివరకు శారీరక సంబంధం పెట్టుకున్నాడు.. ఆ ఘటనను ఫోన్ కెమేరాలో బంధించాడు.. ఆ వీడియో చూపించి ఆమెపై పలుసార్లు అత్యాచారానికి ఒడిగట్టాడు.. చివరకు తన సోదరుడితో కూడా శారీరక సంబంధం పెట్టుకోవాలని బాలికను నిందితుడు బెదిరించడం ప్రారంభించాడు.. దీంతో బాలిక తన తల్లికి మొత్తం విషయం చెప్పేసింది.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు.
రాజస్థాన్‌లోని అల్వార్‌కు సమీపంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక 12వ తరగతి చదువుతోంది. ఆమెకు కొన్ని నెలల కిందట ఓ యువకుడు పరిచయమయ్యాడు. ప్రేమ పేరుతో ఆమెకు దగ్గరయ్యాడు. చివరకు ఇద్దరూ శారీరకంగా ఒక్కటయ్యారు. ఆ ఘటనను నిందితుడు ఫోన్ కెమేరాలో బంధించాడు. ఆ వీడియో చూపించి ఆ బాలికను బెదిరించడం ప్రారంభించాడు. ఆ తర్వాత కూడా ఆ బాలికపై పలుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాదు తన సోదరుడితో కూడా శారీరక సంబంధం పెట్టుకోవాలని ఆ బాలికపై ఒత్తిడి తేవడం ప్రారంభించాడు.
దీంతో ఆ బాలిక మొత్తం విషయాన్ని తన తల్లికి చెప్పేసింది. తల్లి వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.
ఇవి కూడా చదవండి