BJP MLA మనవడివా? అయితేనేం.. బండిపై ఏంటి ఈ పిచ్చి రాతలు.. యువకుడిపై ఫైర్ అవుతున్న నెటిజన్లు..

ABN , First Publish Date - 2022-03-20T00:24:28+05:30 IST

‘‘బండి నెంబర్ ప్లేట్‌ల మీద ఏముంటుంది?’’ అని అడిగితే... ఇదేం పిచ్చి ప్రశ్న.. నెంబర్ ప్లేట్‌పై బండి నెంబర్ ఉంటుందని ఎవ్వరైనా ఠక్కున చెప్పేస్తారు. కానీ ఓ యువకుడి బండి నెంబర్ ప్లేట్‌పై అసలు నెంబరే

BJP MLA మనవడివా? అయితేనేం.. బండిపై ఏంటి ఈ పిచ్చి రాతలు.. యువకుడిపై ఫైర్ అవుతున్న నెటిజన్లు..

ఇంటర్నెట్ డెస్క్: ‘‘బండి నెంబర్ ప్లేట్‌ల మీద ఏముంటుంది?’’ అని అడిగితే... ఇదేం పిచ్చి ప్రశ్న.. నెంబర్ ప్లేట్‌పై బండి నెంబర్ ఉంటుందని ఎవ్వరైనా ఠక్కున చెప్పేస్తారు. కానీ ఓ యువకుడి బండి నెంబర్ ప్లేట్‌పై అసలు నెంబరే లేదు. అంతేకాకుండా దానిపై అతడు ఏం రాయించాడో తెలిస్తే నోరెళ్లబెడతారు. ప్రస్తుతం ఆ యువకుడి బండికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవి చూసి నెటిజన్లు.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



తమిళనాడుకు చెందిన అమ్రిష్ అనే యువకుడు కొద్ది రోజుల క్రితం ఓ బైకును కొనుగోలు చేశాడు. అంత వరకూ బాగానే ఉన్నా తప్పక పాటించాల్సిన నిబంధనలను మాత్రం అతను తుంగలోకి తొక్కాడు. నెంబర్ ప్లేట్‌పై బండి నెంబర్ రాయించలేదు. పైగా తన స్టేటస్ అందరికీ తెలిసే విధంగా ‘నేను నాగర్‌కోయిల్ ఎమ్మెల్యే గాంధీ మనవడిని’ అని నెంబర్ ప్లేట్‌పై రాసుకున్నాడు. అంతటితో ఆ యువకుడు ఆగలేదు. బైక్‌పై చక్కర్లు కొట్టాడు. ఈ క్రమంలో కొందరు అతడి ఫొటోలు తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ ఫొటోలు కాస్తా వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో అతడిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే మనవడివి అయితే మాత్రం నిబంధనలను పాటించవా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. సదరు బీజేపీ ఎమ్మెల్యేకి అసలు పెళ్లే కాలేదు. ఈ విషయాన్ని కూడా నెటిజన్లే గుర్తించారు. ఈ క్రమంలోనే సదరు యువకుడు ఎవరనే అంశంపై ఆరా తీశారు. చివరికి ఎమ్మెల్యే గాంధీ నమ్మినబంటు, ఆయన డ్రైవర్ కన్నన్ కూమారుడిగా అతడిని గుర్తించారు. 


ఇదిలా ఉంటే.. బీజేపీ సీనియర్ లీడర్ గాంధీ 1980 నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. కానీ ఆరుసార్లు ఆయన ఓడిపోయారు. అయినప్పటికీ గత ఎన్నికల్లో పోటీ చేసిన గాంధీ.. 73ఏళ్ల వయసులో ఎమ్మెల్యేగా గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టారు.




Updated Date - 2022-03-20T00:24:28+05:30 IST