Advertisement
Advertisement
Abn logo
Advertisement

బస్సులో కిటికీ పక్కన కూర్చున్న ఆ యువతి మిస్టేక్‌తో తెగిపడిన చేయి.. ఆ తర్వాత ఆమె చేసిన పనికి అవాక్కైన డాక్టర్లు..!

ఇంటర్నెట్ డెస్క్: ఆమెకు ప్రస్తుతం 18ఏళ్లు. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఎప్పటిలాగే బుధవారం రోజు కూడా కాలేజీకి వెళ్లిన ఆమె.. సాయంత్రం ఇంటికి తిరుగు పయనమైంది. స్నేహితురాలితో కలిసి బస్సెక్కి.. కిటికీ పక్కన కూర్చుంది. ఈ క్రమంలోనే ఆమె చేసిన మిస్టేక్‌ కారణంగా చేయి తెగిపడింది. ఆ తర్వాత ఆమె చేసిన పనికి డాక్టర్లు అవాక్కయ్యారు. ఇంతకూ ఏం జరిగిందంటే..


రాజస్థాన్‌లోని కోటా ప్రాంతానికి చెందిన జ్యోతి స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ కాలేజీలో బీఏ మొదటి సంవత్సరం చదువుతోంది. రోజూలాగే బుధవారం  కాలేజీకి వెళ్లిన ఆమె.. స్నేహితురాలితో కలిసి సాయంత్రం బస్సులో ఇంటికి తిరుగుపయనమైంది. బస్సులో కిటీకి పక్కన కూర్చున్న జ్యోతి.. స్నేహితిరాలితో మాట్లాడుతూ తన చేతిని బయటపెట్టింది. సరిగ్గా అదే సమయంలో బస్సు పక్కన నుంచే ఓ ట్రాక్టర్ వెళ్లడంతో.. ట్రాక్టర్ ట్రాలీ తగిలి జ్యోతి చేయి తెగి రోడ్డుపై పడింది. ఊహించని ఘటనతో ఒక్కసారిగా షాకైన జ్యోతి.. తెగిపడిన చేతిని బ్యాగులో పెట్టుకుని, ఏడ్చుకుంటూనే స్నేహితురాలితో కలిసి ఎనిమిది కిలోమీటర్లు దూరంలో ఉన్న ఆసుపత్రికి వెళ్లింది. 


అక్కడ జ్యోతి పరిస్థితిని చూసి డాక్టర్లు అవాక్కయ్యారు. అంతేకాకుండా ఆమెకు వైద్యం చేయలేమని చేతులెత్తేశారు. ప్రథమ చికిత్స చేసి.. జిల్లా ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. దీంతో జ్యోతి జిల్లా ఆసుపత్రికి వెళ్లింది. ఈ క్రమంలో అక్కడి డాక్టర్లు ఆమెకు వైద్యం అందించారు. కాగా.. విషయం తెలియడంతో అక్కడకు చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement