రూ.6కోట్ల అప్పు కోసం బ్యాంకు మెట్లెక్కిన యువరైతు.. అతడి రిక్వెస్ట్ చూసి నోరెళ్లబెట్టిన అధికారులు!

ABN , First Publish Date - 2022-06-19T23:11:33+05:30 IST

ప్రస్తుతం యువత.. ఉన్నత చదువులు, ఐటీ కొలువుల వెంట పరుగులు తీస్తుంటే ఆ యువకుడు మాత్రం వాటి వైపు మొగ్గు చూపలేదు. వ్యవసాయం చేసి.. నలుగురుకీ అన్నం పెట్టాలని భావించాడు. హలం పట్టి పొలం దున్నాడు. అయితే ప్రకృతి చిన్న చూపు

రూ.6కోట్ల అప్పు కోసం బ్యాంకు మెట్లెక్కిన యువరైతు.. అతడి రిక్వెస్ట్ చూసి నోరెళ్లబెట్టిన అధికారులు!

ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం యువత.. ఉన్నత చదువులు, ఐటీ కొలువుల వెంట పరుగులు తీస్తుంటే ఆ యువకుడు మాత్రం వాటి వైపు మొగ్గు చూపలేదు. వ్యవసాయం చేసి.. నలుగురుకీ అన్నం పెట్టాలని భావించాడు. హలం పట్టి పొలం దున్నాడు. అయితే ప్రకృతి చిన్న చూపు చూడటంతో ఆయనకు నష్టాలే మిగిలాయి. ఈ క్రమంలోనే కీలక నిర్ణయం తీసుకున్నాడు. రూ.6కోట్ల రుణం కోరుతూ.. బ్యాంకులో దరఖాస్తు చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆ యువరైతు ఆలోచన తెలుసుకుని బ్యాంకు అధికారులు నోరెళ్లబెట్టారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



మహారాష్ట్ర‌కు చెందిన కైలాస్ పతంగే అనే యువకుడికి ప్రస్తుతం 22ఏళ్లు. ఇతడికి వ్యవసాయం అంటే  చాలా ఇష్టం. ఈ క్రమంలోనే గత ఏడాదితోపాటు అంతకు ముందు సంవత్సరం కూడా తన రెండెకరాల పొలంలో సోయాబీన్ సాగు చేశాడు. అయితే వర్షాలు సరిగా కురవనందువల్ల అతడికి నష్టాలే మిగిలాయే. దీంతో తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నాడు. వ్యవసాయాన్ని వదిలేసి, ఏదైనా కొత్తగా వ్యాపారం మొదలుపెట్టాలని డిసైడ్ అయ్యాడు. ఈ క్రమంలోనే గోరేగావున్ జిల్లాలోని ఓ బ్యాంకుకు వెళ్లాడు. తనకు వ్యాపారం పెట్టుకోవడానికి రూ.6.65కోట్ల రుణం కావాలని దరఖాస్తు చేసుకున్నాడు. అయితే ఆ వ్యాపారం ఏంటో తెలిసి బ్యాంకు అధికారులు షాకయ్యారు. హెలికాప్టర్ కొని దాన్ని అద్దెకు ఇచ్చుకొని వ్యాపారం చేసేందుకు కైలాస్ రుణం అడగటాన్ని చూసి నోరెళ్లబెట్టారు. కాగా.. ప్రస్తుతం కైలాస్ చేసిన పని మహారాష్ట్రలో హాట్‌ టాపిక్‌గా మారింది. 


Updated Date - 2022-06-19T23:11:33+05:30 IST