పోలీసులను తిప్పలు పెట్టిన యువకుడు

ABN , First Publish Date - 2021-05-12T05:20:42+05:30 IST

చింతూరు, మే 11: పోలీసులను తిప్పలు పెట్టిన ఓ యువకుడు చివరకు ఛత్తీ్‌సగడ్‌ పోలీసుల కాల్పుల్లో గాయపడ్డాడు. వివరాల ప్రకరాం.. మహారాష్ట్రలోని అమరావతికి చెందిన మోహిత్‌ అనే యువకుడు సోమవారం రాత్రి ఓ కారులో చింతూరు మీదుగా మోతుగూడెం వెళ్లే ప్రయ త్నం చేశాడు. చింతూరు పోలీసులు ఆ కారును నిలువరించే ప్రయత్నం చేసినప్పటికీ ఆపకుండా నేరుగా మోతుగూడెం వెళ్లి పోలీసుస్టేషను ఎదురుగా

పోలీసులను తిప్పలు పెట్టిన యువకుడు
పోలీసుల కాల్పుల్లో గాయపడిన మోహిత్‌

కాల్పుల్లో గాయపడి చిక్కిన వైనం

చింతూరు, మే 11: పోలీసులను తిప్పలు పెట్టిన ఓ యువకుడు చివరకు ఛత్తీ్‌సగడ్‌ పోలీసుల కాల్పుల్లో గాయపడ్డాడు. వివరాల ప్రకరాం.. మహారాష్ట్రలోని అమరావతికి చెందిన మోహిత్‌ అనే యువకుడు సోమవారం రాత్రి ఓ కారులో చింతూరు మీదుగా మోతుగూడెం వెళ్లే ప్రయ త్నం చేశాడు. చింతూరు పోలీసులు ఆ కారును నిలువరించే ప్రయత్నం చేసినప్పటికీ ఆపకుండా నేరుగా మోతుగూడెం వెళ్లి పోలీసుస్టేషను ఎదురుగా ఉన్న బారికేడ్‌ను ఢీ కొన్నాడు. అక్కడి నుంచి వెనకకు వచ్చి ఘాట్‌మీదుగా మారేడుమిల్లి వైపు వేగంగా వెళ్లాడు. మళ్లీ వెనకకు వచ్చివ యా చింతూరు మీదుగా సరిహద్దు రాష్ట్రమైన ఒడిస్సా వైపు వెళ్లే ప్రయత్నంలో చింతూరు మండలం కల్లేరు సమీపంలో ఒడిస్సా చెక్‌పోస్టును ఢీ కొన్నాడు. తిరిగి మంగళవారం ఒడిస్సా వైపు నుంచి మళ్లీ వెనకకు తిరిగి వచ్చి వయా చింతూరు మీదుగా ఛత్తీ్‌సగడ్‌ వైపు వెళ్లే ప్రయత్నం చేశా డు. ఈ క్రమంలో సుక్మా జిల్లాలోని జాతీయ రహదారిపై ఉన్నటువంటి డోర్నపాల్‌, ఇంజరం, కుర్తీ వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులను కారుతో ఢీ కొడుతూ వేగంగా ముందుకు వెళ్లాడు. దీంతో అప్రమత్తమైన ఛత్తీ్‌సగడ్‌ పోలీసులు పందిగొండ చెక్‌పోస్టులో జవాన్లకు సమాచారం అందించారు. మోహిత్‌ కారు అక్కడి చెక్‌పోస్టుకు చేరుకోగానే కారును నిలువరింపజేసే ప్రయత్నం చేశారు. కారు వేగం తగ్గక పోవడంతో జవాన్లు కారుపై కాల్పులు జరపడంతో కారు అదుపుతప్పి రహదారి పక్కన పడిపోయింది. మోహిత్‌ గాయపడ్డాడు. అతడిని సుక్మా తరలించిన జవాన్లు చికిత్స అందిస్తున్నారు. చింతూరు మండలం, మోతుగూడెం పోలీసు స్టేషన్లో మోహిత్‌పై కేసు నమోదైంది. 

Updated Date - 2021-05-12T05:20:42+05:30 IST