యోగా దినచర్యలో భాగం కావాలి

ABN , First Publish Date - 2022-05-24T05:06:56+05:30 IST

ప్రతిఒక్కరి జీవితంలో యోగా భాగం కావాలని సినీనటుడు సంపూర్ణే్‌షబాబు అన్నారు.

యోగా దినచర్యలో భాగం కావాలి

సినీనటుడు సంపూర్ణే్‌షబాబు

సిద్దిపేట టౌన్‌, మే 23: ప్రతిఒక్కరి జీవితంలో యోగా భాగం కావాలని సినీనటుడు సంపూర్ణే్‌షబాబు అన్నారు. ఆదివారం రాత్రి సిద్దిపేట పట్టణంలోని విపంచి కళానిలయంలో వ్యాస మహర్షి యోగా సొసైటీ ఆధ్వర్యంలో బాల సంస్కార్‌ వేసవి శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. విద్యార్థులు అన్నిరంగాల్లో అభివృద్ధి చెందాలని సూచించారు. వ్యాస మహర్షి యోగా సొసైటీ అధ్యక్షుడు నిమ్మ శ్రీనివా్‌సరెడ్డి, ప్రధాన కార్యదర్శి తోట సతీష్‌ మాట్లాడుతూ ఈసారి బాల సంస్కార్‌ ద్వారా 21 రోజులపాటు 110 మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్‌రెడ్డి, సిద్దిపేట జిల్లా యోగాసన స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు తోట అశోక్‌, రాష్ట్ర ప్రెస్‌ అకాడమీ సభ్యుడు, యోగా అసోసియేషన్‌ గౌరవ అధ్యక్షుడు కొమురవెల్లి అంజయ్య పాల్గొన్నారు.

Updated Date - 2022-05-24T05:06:56+05:30 IST