ఎంత భద్రం

ABN , First Publish Date - 2022-07-15T07:08:19+05:30 IST

గోదావరి నదీపాయల వెంబడి ఉన్న ఏటిగట్లు బల హీనంగా ఉన్నాయి.

ఎంత భద్రం
కూళ్ల వద్ద బలహీన ఏటిగట్టుకు తాత్కాలిక రక్షణ చర్యలు

గోదావరి గట్లు  30 చోట్ల బలహీనం

ఇసుక బస్తాలతో సరి 

వరద పెరిగితే గండ్లే

ప్రజల్లో తీవ్ర ఆందోళనలు

ఫ్లడ్‌ స్టోర్స్‌లో మెటీరియల్‌ నిల్‌

 మూడేళ్లలో గట్లకు ఒక్క రూపాయి నిధుల్లేవు


(అమలాపురం-ఆంధ్రజ్యోతి)

గోదావరి నదీపాయల వెంబడి ఉన్న ఏటిగట్లు బల హీనంగా ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో మట్టి, ఇసుక మాఫియా ముఠాలు ఇష్టానుసారం ఏటిగట్లను ఛిద్రం చేశాయి. దీంతో అనేకచోట్ల గట్లు బలహీనంగా ఉన్న ప్పటికీ గోదావరి హెడ్‌వర్క్స్‌ డివిజన్‌ అధికారులు వాటి స్థితిగతులపై కనీసం దృష్టి సారించలేదు. ఫలితంగా ముందెన్నడూలేని రీతిలో జూలై రెండో వారంలోనే గోదా వరికి తీవ్రస్థాయిలో వరదలు ముంచెత్తడంతో నదీ పరీ వాహకంలో ఉన్న ఏటిగట్లు పరిస్థితి ఇప్పుడు ప్రశ్నార్థక మైంది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గోదావరి ఏటి గట్ల పటిష్టత కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. ఫలితంగా బలహీన గట్లను ఆనుకుని ఉన్న గ్రామాల ప్రజలు తీవ్రమైన భయాందోళనలు చెందుతు న్నాయి. 1986లో రికార్డు స్థాయిని సైతం బ్రేక్‌చేసే అవ కాశాలు ఉన్న దృష్ట్యా బలహీన గట్లు ఉన్న ప్రాంతాల్లో గండ్లు పడే ప్రమాదం ఉందనేది నిపుణుల అంచనా. కోనసీమలోని గౌతమీ, వృద్ధగౌతమీ, వైనతేయ, వశిష్ఠ నదీపాయల వెంబడి ఉన్న ఏటిగట్లు అనేకచోట్ల బల హీనంగా ఉన్నట్టు అధికారులు ఇప్పటికే గుర్తించారు. ముఖ్యంగా పూర్వపు ఉభయగోదావరి జిల్లాల్లో 30 చోట్ల ఏటిగట్లు బలహీనంగా ఉన్నట్టు కన్జర్వేటివ్‌ డిపార్టు మెంటు గుర్తించి ప్రభుత్వానికి నిపుణుల కమిటీ నివేదిక లిచ్చింది. ఆ నివేదికను జగన్‌ ప్రభుత్వం పక్కన పెట్టే సింది. ఇప్పుడు వరదలు రికార్డు స్థాయిలో ముంచుకు రావడంతో ఆ నివేదికపై చర్చ సాగుతోంది. ముఖ్యంగా జిల్లాలోని గౌతమీ నది ఎడమగట్టులో పలుచోట్ల ఏటి గట్లు బలహీనంగా ఉన్నాయి. మట్టి, ఇసుక తవ్వకాలతో గట్లను ఛిద్రం చేశారు. కె.గంగవరం మండలం కూళ్ల, సుందరపల్లితోపాటు కపిలేశ్వరపురం మండలంలోని పలుచోట్ల, కోటిపల్లి సమీపంలో కొన్నిచోట్ల గోదావరి గట్టు బలహీనంగా ఉంది. ముమ్మిడివరం మండలం చింతవానిరేవు, ఐ.పోలవరం మండలంలోని రింగ్‌బండ్‌, పి.గన్నవరం మండలం శివారు తాటికాయలవారిపాలెం, గంటిపెదపూడి, యర్రంశెట్టివారిపాలెం, మొండెపులంక కాల్వవైపు, పెదపట్నం పరిసర ప్రాంతాలతోపాటు మలి కిపురం నుంచి సఖినేటిపల్లి వెళ్లే ఏటిగట్లు, అయినవిల్లి మండలం శానపల్లిలంక దగ్గర, వృద్ధగౌతమీ నదీపాయ లకు ఇరువైపులా అనేక ప్రాంతాల్లో ఏటిగట్లు బలహీ నంగా ఉండి ప్రజలను భయాందోళనలకు గురి చేస్తు న్నాయి. ఫ్లడ్‌ స్టోర్స్‌లో కనీసం రక్షణ సామగ్రిని కూడా సిద్ధం చేసుకోలేని పరిస్థితుల్లో అధికారులు ఉన్నారు. ప్రస్తుతానికి కొన్నిచోట్ల ఇసుక మాత్రం అందుబాటులో ఉండడంతో ఇసుక బస్తాలు, గ్రావెల్‌వేసి గట్లను మమ అనిపిస్తున్నారు. ఏ క్షణం ఏ ప్రమాదం వస్తుందోనన్న భయం తీర గ్రామాల ప్రజలకు నిద్రలేకుండా చేస్తోంది.


Updated Date - 2022-07-15T07:08:19+05:30 IST