వైసీపీ రాసలీలల పార్టీ

ABN , First Publish Date - 2022-08-06T05:14:03+05:30 IST

వైసీపీ రాసలీలల పార్టీగా మారిపోయిందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ విప్‌ కూన రవికుమార్‌ విమర్శించారు. శ్రీకాకుళంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘ఆర్థిక నేర గాళ్లకు, రేప్‌ కేసులున్నవారికి, బూతులు మాట్లాడినవారికే వైసీపీ పునరావాస కేంద్రంలా తయారైంద’ని తెలిపారు.

వైసీపీ రాసలీలల పార్టీ
మాట్లాడుతున్న టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌

- నేరస్థులకు అది పునరావాస కేంద్రం
- ఎంపీ గోరంట్ల మాధవ్‌ను ఎందుకు సస్పెండ్‌ చేయలేదు?
- టీడీపీ జిల్లా అధ్యక్షుడు రవికుమార్‌
శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి, ఆగస్టు 5:
వైసీపీ రాసలీలల పార్టీగా మారిపోయిందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ విప్‌ కూన రవికుమార్‌ విమర్శించారు. శ్రీకాకుళంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘ఆర్థిక నేర గాళ్లకు, రేప్‌ కేసులున్నవారికి, బూతులు మాట్లాడినవారికే వైసీపీ పునరావాస కేంద్రంలా తయారైంది. ఎన్నికల ముందు వైఎస్‌ జగన్‌ ముద్దులు పెడుతూ పాదయాత్ర సాగిం చారు. అందులోనూ అశ్లీలత ఉందనిపిస్తోంది. గంట, అరగంట అంటూ మహిళలతో నీచంగా మాట్లాడిన అంబటి, అవంతిని పార్టీలోనే కొనసాగిస్తున్నారు. మహిళా వలం టీర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన జోగి రమేష్‌కు మంత్రిగా ప్రమోషన్‌ ఇచ్చారు. 17 కేసుల్లో నిందితుడిగా ఉన్న ఏ1 జగన్‌ సీఎంగాను, ఏ2 విజయసాయిరెడ్డి రాజ్యసభలో ఎంపీగా ఉన్నారు. రాష్ట్రంలోని 2.5 కోట్ల మంది మహిళలు సిగ్గుపడేలా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ వ్యవహరించారు. పోర్న్‌ వీడియోను ప్రమోట్‌ చేసుకున్నాడు. వైసీపీలో చేరకముందే ఆయనపై రేప్‌ కేసు ఉంది. అయినా అతనికి హిందూపురం ఎంపీ టికెట్‌ ఇచ్చి ప్రోత్సహించారు. బూతులు మాట్లాడే వారికి మంత్రి పదవులు ఇస్తున్నారు. గన్‌ కంటే ముందు జగన్‌ వస్తారన్న మంత్రులు రోజా, విడదల రజని.. ఎంపీ గోరంట్ల బాగో తంపై ఇప్పుడెందుకు నోరు విప్పడం లేదు. చివరకు సిగ్గు లేకుండా ఎంపీ మాధవ్‌ టీడీపీ నేతలపై విమర్శలు చేస్తున్నారు. ఇంతవరకు మాధవ్‌ ను వైసీపీ అధిష్ఠానం ఎందుకు సస్పెండ్‌ చేయలేదు. ఇకపై సీఎం జగన్‌ కూడా ఏ ఆడపిల్లను తాకవద్దు, తలపై చేయి వేసి నిమరవద్దు. మహిళలు ప్రజాప్రతినిధుల వద్దకు వెళ్లా లంటేనే భయపడుతున్నారు. ఇప్పటికైనా అంబటి, జోగి, కొడాలి, ఎంపీ మాధవ్‌ వంటి వారిపై చర్యలు తీసుకుంటే వైసీపీ నాయకు లను తెలుగుజాతి క్షమిస్తుంద’ని తెలిపారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు బగ్గు రమణమూర్తి, గుండ లక్ష్మీదేవి, టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు చౌదరి బాబ్జి, ఉపాధ్య క్షుడు పీఎంజే బాబు, పార్టీ నగర అధ్యక్షుడు మాదారపు వెంక టేష్‌, సింతు సుధాకర్‌ పాల్గొన్నారు.


 

Updated Date - 2022-08-06T05:14:03+05:30 IST