Abn logo
Jan 25 2021 @ 07:14AM

నేడు వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం

అమరావతి: వైసీపీ పార్లమెంటరీ సమావేశం ఈరోజు ఉదయం 11 గంటలకు తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో జరుగనుంది. త్వరలో జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై  ఎంపీలతో సీఎం జగన్ చర్చించనున్నారు. ఏపీకి రావాల్సిన నిధులు, ఇచ్చిన హామీలు, కొత్త సాగు చట్టాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.  అనంతరం మధ్యాహ్నం 3:30 గంటలకు దిశ చట్టాన్ని అమలు చేయనున్నారు. అలాగే జిల్లా రైతు భరోసా పోలీస్ స్టేషన్, మహిళ పోలీస్ క్యాడర్‌ను మెయిన్ స్ట్రీమ్‌లోకి తేవడంపై సంబంధిత అధికారులతో సీఎం జగన్ సమీక్ష జరుపనున్నారు. 

Advertisement
Advertisement
Advertisement