Advertisement
Advertisement
Abn logo
Advertisement

వైసీపీ నేతలవి దిగజారుడు మాటలు

పీఏసీ చైర్మన పయ్యావుల కేశవ్‌

అనంతపురం, నవంబరు 26(ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో వైసీపీ నేతలు దిగజారి మాట్లాడుతున్నారని పీఏసీ చైర్మన, ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ అన్నారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును ఏ రకంగానూ ఎదుర్కోలేకనే చివరికి ఆయన ఆత్మస్థైర్యం దెబ్బతీసేందుకు కుటుంబసభ్యులను అడ్డుపెట్టుకొని దిగజారుడుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. శుక్రవారం ఆయన అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ.... రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల్లో చర్చనీయాంశం కాకుండా మరుగున పరిచేందుకే గొప్ప నాయకుడైన చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారన్నారు. తమ నాయకుడితో పాటు ఆయన భార్య భువనేశ్వరీ గురించి మాట్లాడిన మాటలు రాష్ట్రంలో ప్రతి కుటుంబాన్ని కలచివేశాయన్నారు. భువనేశ్వరీ ఏ రోజూ రాజకీయాల్లోకి రా లేదన్నారు. ఎన్టీఆర్‌ ట్రస్టు ద్వారా ఆమె సేవా కార్యక్రమాలు చేయడంలోనే నిమగ్నమయ్యారన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. ఆమెపై మాట్లాడిన మా టలు చాలా బాధాకరమన్నారు. ఆ మాటలు ఎ వరు మాట్లాడినా సరైంది కాదన్నారు. ఎవరైతే తమ నాయకుడి సతీమణిపై దిగజారుడు మాటలు మా ట్లాడారో అలాంటి మంత్రులు, ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి 20 మంది పోలీసులతో భద్రత కల్పిస్తుండటం హాస్యాస్పదంగా ఉందన్నారు. భువనేశ్వరిపై మాట్లాడిన మాటలకు బాధపడి తమ పార్టీ మహిళలు ప్రతి విమర్శలు చేస్తే పోలీసులతో దాడులు చేయించడం ఏ మేరకు సమంజసమని ప్రశ్నించారు. పోలీసు వ్యవస్థ గానీ... ఆ వ్యవస్థకు బాస్‌గా వ్యవహరిస్తున్న డీజీపీ దీన్ని ఏరకంగా సమర్థించుకుంటారన్నారు. బాధతో, ఆవేదనతో మాట్లాడిన తమ పార్టీ మహిళా నాయకురాళ్ల ఇళ్లపై దాడులు చేసిన పోలీసులు.. మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై కూడా అదే రకమైన దాడులు చేయాలి కదా అని ఆయన ప్ర శ్నించారు. జిల్లా కేంద్రంలో తమ పార్టీ మహిళల ఇళ్లపై పోలీసులు ప్రవర్తించిన తీరును రాష్ట్రం మొత్తంచూసిందన్నారు. మీడియా సమావేశంలో ప్రతి విమర్శలు చేసినందుకు నోటీసులు ఇచ్చిన సందర్భంలో వారు పోలీ్‌సస్టేషనకు హాజరైన విషయాన్ని గుర్తు చేశారు. అలాంటప్పుడు ఇళ్లపైకెళ్లి దా డులు చేయడంతో పాటు భయాందోళనలు సృష్టించే విధంగా బ్యాంకు డాక్యుమెంట్లు, ఇతరత్రా వాటిని తనిఖీ చేయడం వెనుక ఆంతర్యమేంటని ప్రశ్నించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఇదే జరుగుతుందనే భయాన్ని సమాజంలో చొప్పించడానికి చేసిన ప్రయత్నంగా కనిపిస్తోందన్నారు. అసెంబ్లీలో ప్రజల కష్టాలు, కన్నీళ్లు, బాధలపై చర్చ జరగాలి గానీ...ప్రభుత్వం మాత్రం రివర్స్‌లో వెళ్తోందన్నారు. రాజకీయాల్లో ఇది మంచి పరిణామం కా దన్న విషయాన్ని వైసీపీ పాలకులు గుర్తిస్తే మంచిదని హితవు పలికారు.

Advertisement
Advertisement