తోట త్రిమూర్తులుకు ఎమ్మెల్సీ

ABN , First Publish Date - 2021-06-15T05:29:17+05:30 IST

ద్రాక్షారామ, జూన్‌ 14: అమలాపురం పార్లమెంటు వైసీపీ అఽధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులుకు ఎమ్మెల్సీగా గవర్నర్‌ ఎట్టకేలకు ఆమోదముద్ర పడింది. గవర్నర్‌ కోటాలో ఖాళీ అయిన నాలుగు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒక స్థానానికి మన జిల్లా నుంచి తోట త్రిమూర్తులును నామినేట్‌ చేస్తూ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. 2019 సార్వత్రిక ఎన్నికల్లో రామచంద్రపురం

తోట త్రిమూర్తులుకు ఎమ్మెల్సీ

గవర్నర్‌ కోటాలో ఎంపిక చేస్తూ ఎట్టకేలకు ఆమోదం

వైసీపీ రాజమహేంద్రవరం పార్లమెంటు ఇన్‌చార్జి 

కొయ్యే మోషేనురాజుకూ ఎమ్మెల్సీ పదవి

ద్రాక్షారామ, జూన్‌ 14: అమలాపురం పార్లమెంటు వైసీపీ అఽధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులుకు ఎమ్మెల్సీగా గవర్నర్‌ ఎట్టకేలకు ఆమోదముద్ర పడింది. గవర్నర్‌ కోటాలో ఖాళీ అయిన నాలుగు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒక స్థానానికి మన జిల్లా నుంచి తోట త్రిమూర్తులును నామినేట్‌ చేస్తూ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. 2019 సార్వత్రిక ఎన్నికల్లో రామచంద్రపురం నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున శాసనసభకు పోటీ చేసిన త్రిమూర్తులు ఓటమి చెందారు. అనంతరం 2019 సెప్టెంబరు నెలలో తోట త్రిమూర్తులు వైసీపీలో చేరారు. త్రిమూర్తులుకు అప్పట్లో ఎమ్మెల్సీ ఇస్తామని వైసీపీ అధి ష్ఠానం హామీ ఇచ్చింది. అనంతరం తోట త్రిమూర్తులును అమలాపురం పార్లమెంటు పార్టీ అధ్యక్షుడిగా నియమించారు. తదుపరి మండపేట నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జిగానూ బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుంచి రెండు పర్యాయాలు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా జిల్లా నుంచి మాజీ ఎంపీ పండుల రవీంద్రబాబుకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. ప్రస్తుతం గవర్నర్‌ కోటాలో నాలుగు స్థానాలు ఖాళీ కావడంతో తోట త్రిమూర్తులును గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ స్థానానికి ఎంపిక చేశారు.


మోషేనురాజుకూ ఎమ్మెల్సీ

రాజమహేంద్రవరం పార్లమెంటు వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న పశ్చి మగోదావరి జిల్లా భీమవరం పట్టణానికి చెందిన వైసీపీ సీనియర్‌ నేత మోషేనురాజుకు కూడా గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ దక్కింది. 

Updated Date - 2021-06-15T05:29:17+05:30 IST