చిన్న కండ్లేరును విస్మరించిన వైసీపీ

ABN , First Publish Date - 2022-07-04T05:04:13+05:30 IST

చిన్న కండ్లేరు అనుసంధానాన్ని వైసీపీ పాలకులు విస్మరిం చారని, దాని సాధన కోసం జనసేన పార్టీ పోరాటం చేయాలని పార్టీ మండల నాయ కులు అధినేత పవన్‌ కల్యాణ్‌ దృష్టికి తీసు కెళ్లారు.

చిన్న కండ్లేరును విస్మరించిన వైసీపీ
పవన్‌కు వినతిపత్రం అందజేస్తున్న పుల్లలచెరువు పవననాయకులు

అనుసంధానం కోసం పోరాడాలి

జనవాణిలో పవన్‌ దృష్టికి సమస్యలు 

పుల్లలచెరువు, జూలై 3 : చిన్న కండ్లేరు అనుసంధానాన్ని వైసీపీ పాలకులు విస్మరిం చారని, దాని సాధన కోసం జనసేన పార్టీ పోరాటం చేయాలని పార్టీ మండల నాయ కులు అధినేత పవన్‌ కల్యాణ్‌ దృష్టికి తీసు కెళ్లారు. శాశ్వత కరువు నివారణ చిన్న కండ్లేరు అనుసంధానంతోనే సాధ్యమని వారు పవన్‌కు వివరించారు. అధికారంలోకి వస్తే చిన్న కం డ్లేరును అనుసంధానం చేస్తామని వైసీపీ ఇచ్చి న హామీ నీటిపాలైందన్నారు. ఆదివారం మం గళగిరిలో నిర్వహించిన జనవాణి కార్యక్రమం లో పుల్లలచెరువు మండలంలోని ప్రధాన సమ స్యలను జనసేన పార్టీ అధినేత పవన్‌కు తెలి పారు. తాగునీటి సమస్య వేధిస్తోందని, ముటుకుల ప్రాజెక్టు మూలన పడిందన్నారు.  జూని యర్‌ కాలేజీ లేక విద్యార్థులు ఇబ్బంది పడు తున్నారని, కొందరు ఉన్నత విద్యకు దూర మవుతున్నారని తెలిపారు. గారపెంట గిరిజన గూడెంలో ఐటీడీఏ ద్వారా కట్టించిన ఇళ్లు శిథిలమయ్యాయన్నారు. దీంతో గిరిజనులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారని తెలిపారు. మండలంలో రోడ్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.  కార్య క్రమంలో జనసేన పార్టీ మండలాధ్యక్షుడు కటారి అచ్చయ్య, తోట కాశిరామ్‌, రమణయ్య, శివ పాల్గొన్నారు. 

త్రిపురాంతకంలో..

త్రిపురాంతకం : జనసేన పార్టీ అధినేత పవణ్‌ కల్యాణ్‌ దృష్టికి మండలంలోని పలు సమస్యలపై పార్టీ మండలాధ్యక్షుడు ఆవుల మల్లికార్జున వినతిపత్రాన్ని అందించారు. ఆదివారం నిర్వహించిన జనవాణలో మండలంలోని సగం గ్రామాల్లో తాగునీటి సమస్య ఉందని త్రిపురాంతకం చెరువులో ఎస్‌ఎస్‌ ట్యాంక్‌ను నిర్మించడం ద్వారా సమస్యను పరిష్కరించవచ్చని అధినేత పవన్‌ దృష్టికి నా యకులు తీసుకెళ్లారు. గ్రామాల్లో అంతర్గత రహదారులు సక్రమంగా లేక చిన్నపాటి  వానొచ్చినా రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నా యన్నారు. గ్రామాలకు లింక్‌ రోడ్లు కూడా లేవని దీంతో ప్రజలు, ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని నాయకులు పవన్‌కు వివ రించారు. 


Updated Date - 2022-07-04T05:04:13+05:30 IST