Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రజలను దగా చేస్తున్న వైసీపీ

నాయుడుపేట టౌన్‌, అక్టోబరు 17 : ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చ కుండా వైసీపీ ప్రజలను దగా చేస్తోందని  సూళ్లూరుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్‌ చార్జి నెలవల సుబ్రహ్మణ్యం విమర్శించా రు. నాయుడుపేట టీడీపీ కార్యాలయంలో ఆదివారం పట్టణ టీడీపీ అధ్యక్షుడు కం దల కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన మండలస్థాయి టీడీపీ కార్యకర్తల సమావే శంలో ఆయన మాట్లాడారు.  గూడూరు రఘునాథరెడ్డి, తిరుమూరు సుధాకర్‌రెడ్డి, మండల టీడీపీ అధ్యక్షుడు దువ్వూరు అ శోక్‌రెడ్డి,  జడ్పీటీసీ మాజీ సభ్యుడు శ్రీరా మ్‌ ప్రసాద్‌, నానబాల సుబ్బరావు, పరసా రాజ, అవధానం సుధీర్‌, నారాయణ,  ర వి, దార్ల రాజేంద్ర, తదితరులు ఉన్నారు. 

కలువాయి: ఒక్క అవకాశం అంటూ అధికారంలోని వచ్చిన వైసీపీ ప్రభుత్వం అరాచకంగా వ్యవహరిస్తోందని వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అన్నారు. గ్రామ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఆయన, టీడీపీ నాయకులతో కలసి చీపినాపి గ్రామంలో పర్యటించారు పంచాయతీ నిధులతో నిర్మించిన మినరల్‌ వాటర్‌ ప్లాంటును పంచాయతీకి అప్పగించకుం డా వైసీపీ నాయకులు ఇబ్బందులు పెడుతున్నారన్నారు. ఈ ప్లాంటును ఇకనైనా అధికారులు పంచాయతీకి అప్పగించకుంటే మండల పరిషత్‌ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు.  సర్పం చు పెంచలయ్య, నాయకులు బొల్లినేని ఆంజనేయులు నాయుడు, వసంతయ్య, జీ.వెంకటేశ్వర్లు నాయుడు పాల్గొన్నారు. 

కోట : కోట మండల టీడీపీ కార్యవర్గ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేపాశిం సునీ ల్‌ కుమార్‌ మాట్లాడారు.మద్దాలి సర్వోత్త మ రెడ్డి, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌, మైనార్టీసెల్‌ జిల్లా ఉపాధ్యక్షుడు జలీల్‌ అ హ్మద్‌, ఎంపీటీసీలు సురేష్‌, షంషుద్దీన్‌, మోహన్‌రెడ్డి, అనిల్‌, మధుయాదవ్‌, తది తరులు ఉన్నారు. 


Advertisement
Advertisement