యమ‘కంకరు’లు

ABN , First Publish Date - 2022-01-24T05:29:43+05:30 IST

ఇచ్ఛాపురం పట్టణ శివార్లలోగల పీర్లకొండ నుంచి కంకర, ఎర్రమట్టిని యథేచ్ఛగా తరలిస్తున్నారు. ప్రస్తు తం ఇళ్ల పనుల కోసం కొండలు, గుట్టలను తొలిచి ట్రాక్టర్‌ లోడు మూడు వేలు వరకు విక్రయిస్తున్నారు.

యమ‘కంకరు’లు
కొండను తవ్వేస్తున్న దృశ్యం

  కొండలు తొలిచి... కంకర తరలింపు ఫ పీర్లకొండలో ఆగని తవ్వకాలు

ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురం పట్టణ శివార్లలోగల పీర్లకొండ నుంచి కంకర, ఎర్రమట్టిని యథేచ్ఛగా తరలిస్తున్నారు. ప్రస్తు తం ఇళ్ల పనుల కోసం కొండలు, గుట్టలను తొలిచి ట్రాక్టర్‌ లోడు మూడు వేలు వరకు విక్రయిస్తున్నారు.లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించిన తర్వాత డెవలపర్లు వెంచర్లు భారీగా వేస్తున్నారు. దీంతో లేఅవుట్ల కోసం  రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులు చీకటిపడిన తర్వాత ప్రతిరోజూ 50 వరకు ట్రాక్టర్లు, లారీలతో కంకర తరలిస్తున్నారు. భూగర్భగనులు, రెవెన్యూ అటవీశాఖ సిబ్బంది, పోలీసుల అనుమతి లేకుండానే అక్రమార్కులు ఇష్టానుసారంగా తరలిస్తున్నారు. తరచూ వాహ నాల రాకపోకల వల్ల ఇక్కడి రోడ్లు పూర్తిగా పాడయ్యాయి. ఎర్రమట్టి ట్రాక్టరు రూ.1000 వరకు పలుకుతోంది. అధికారులు లేని సమయాల్లో, సెలవు రోజుల్లో రాత్రిపూట ఇచ్ఛాపు రం మునిసిపాలిటీ, మండలం పరిధిలో 15 లేఅవుట్లకు  కం కర తరలిస్తుండడం విశేషం. అనుమతిలేకుండా తవ్వకాలు చేపట్టడంపై చర్యలు తీసుకుంటామని తహసీల్దార్‌ శ్రీహరి ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. పీర్లకొండ నుంచి కంకర తరలింపును అడ్డుకుంటామని చెప్పారు. 


 


Updated Date - 2022-01-24T05:29:43+05:30 IST