Yalakki Bananas: కొండెక్కిన యాలక్కి అరటిపండ్లు.. కిలో రూ. 100 నుంచి రూ.120 పైమాటే

ABN , First Publish Date - 2022-07-29T17:50:38+05:30 IST

శ్రావణమాసం ప్రారంభం కావడటంతో పండ్లు, పూల ధరలకు రెక్కలొచ్చేశాయి. ఇప్పటికే పన్నుల ఎడాపెడా వాతలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న

Yalakki Bananas: కొండెక్కిన యాలక్కి అరటిపండ్లు.. కిలో రూ. 100 నుంచి రూ.120 పైమాటే

బెంగళూరు, జూలై 28 (ఆంధ్రజ్యోతి): శ్రావణమాసం ప్రారంభం కావడంతో పండ్లు, పూల ధరలకు రెక్కలొచ్చేశాయి. ఇప్పటికే పన్నుల ఎడాపెడా వాతలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సామాన్యులపై పండుగల వేళ ధరాఘాతం తప్పేలా లేదు. శ్రావణమాసం(Sravanamasam)లో పూజలకు అత్యవసరం అయ్యే యాలక్కి అరటిపండ్ల(Yalakki Bananas) ధర ఏకంగా ఆకాశాన్నంటింది. గత వారం వరకు కిలో 50 నుండి 60 లోపు ధర పలికిన యాలక్కి అరటిపండ్ల ధర ప్రస్తుతం సెంచరీ దాటేసింది. ఈ ధర కిలో 120కు చేరుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇంకా మంచి ధర వస్తుందన్న ఉద్దేశ్యంతో చాలా మంది అరటి తోట రైతులు తమ పంటను అలాగే ఉంచేశారు. మార్కట్‌లోకి స రుకు సరిగ్గా రానందునే ధరలు పెరిగాయని తెలుస్తోంది. ఇక పచ్చబాళె ధర కూడా కిలో 60 వరకు పలుకుతోంది. సాధారణ రోజుల్లో ఈ ధర కిలో 20-30 లోపే ఉంటుంది. శ్రావణమాసం పూర్తయ్యేంతవరకు పూలు, పండ్ల ధరలు తగ్గే అవకాశాలు లేవని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. అయితే మార్కెట్‌లో గత పది రోజులుగా టమోటా(Tomato) ధరలు అమాంతం పడిపోయాయి. మార్కెట్‌లో కిలో టమోటాల ధర  8 నుండి 10 రూపాయలు పలుకుతోంది. ధరలు పాతాళానికి చేరుకోవడంతో చాలా మంది రైతులు తమ టమోటా(Tomato) పంటను కోయకుండా తోటల్లో అలాగే వదిలేస్తున్నారు. ధరలు పడిపోవడంతో టమోటా రైతులు భారీగా నష్టపోయినట్లు మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి. 

Updated Date - 2022-07-29T17:50:38+05:30 IST