ఆ కంప్యూటర్‌ వైరస్‌ కంటే కరోనాయే బెటరా?

ABN , First Publish Date - 2020-04-18T03:12:46+05:30 IST

కరోనా వైరస్‌ కంటే డేంజరస్‌ వైరస్‌ ఉందా? కానీ అది కంప్యూటర్‌కే పరిమితమా? మరి రాంజీ, బాబ్జీ ఏమంటున్నారో వినండి.

ఆ కంప్యూటర్‌ వైరస్‌ కంటే కరోనాయే బెటరా?

కరోనా వైరస్‌ కంటే డేంజరస్‌ వైరస్‌ ఉందా? కానీ అది కంప్యూటర్‌కే పరిమితమా? మరి రాంజీ, బాబ్జీ ఏమంటున్నారో వినండి.


రాంజీ : ఏరా బాబ్జీ ఇది విన్నావా?... ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే ఒకడు చుట్టకోసం నిప్పు వెతుక్కున్నాట్ట.

బాబ్జీ : ఇదేంట్రా? టెక్నాలజీ చెప్పమంటే సామెతలు చెబుతున్నావేంటి?


రాంజీ : అవున్రా ఇది టెక్నాలజీకి సంబంధించిన సామెతే. ఇల్లు కాలొకడు ఏడుస్తుంటే ఒకడు చుట్టకోసం నిప్పు వెతుక్కున్నాట్ట. కరోనా వైరస్‌ తో జనం ఇబ్బందులు పడుతుంటే కంప్యూటర్‌ వైరస్‌ లు కొందరు సృష్టిస్తున్నారు.

బాబ్జీ : ఎవరు వాళ్లు? ఏంటా వైరస్సులు?


రాంజీ : అసలే ప్రపంచం అంతా కరోనా వైరస్‌ తో కంగారు పడుతోందా? ఈ సిట్యుయేషన్లో కరోనా పేరు మీద వైరస్‌ లు సృష్టించే ఇడియట్స్‌ ఎక్కువైపోయారు.

బాబ్జీ : అది తెలుసులే. అందుకేగా ఇప్పుడు యూట్యూబ్‌లో కూడా కరోనా గిరోనాఅని ట్యాగ్స్‌ పెడితే ఊరుకోడం లేదు.


రాంజీ : ( బ్లింక్‌ )

బాబ్జీ : అవును మరి. అందరూ విజ్ఞానులే! చిల్లర డబ్బుల కోసం నెట్లో ఎవడికి తోచింది వాడు చెప్పేస్తున్నాడు. వీళ్లని కంట్రోల్‌ చేయకపోతే ఎలాగ?


రాంజీ : జనాన్ని కంట్రోల్ చేయడం మాట అటుంచరా ... అసలు ఓ మాల్‌వేర్‌ ని కంట్రోల్‌ చేయలేక ఇంటర్‌నెట్‌ మొత్తం గగ్గోలెత్తుతోంది.

బాబ్జీ : మాల్‌ వేరా? అదేంట్రా? ఇప్పుడు మాల్స్‌ అన్నీ క్లోజ్‌ కదా?


రాంజీ : మాల్‌ వేర్‌ అంటే … ఫుట్‌వేర్‌ … నెట్‌ వేరూ కాదురా.. మాల్‌ వేర్‌ అంటే వైరస్‌...

బాబ్జీ : వైరస్సా?


రాంజీ : అదేగా మరి చెప్పేది? ఎక్స్‌ హెల్పర్‌ అనీ.. ఓ వైరస్‌ యాప్‌... పేరుకి హెల్పర్‌.. కానీ ఫోన్‌కి డేంజర్‌... యాండ్రాయిడ్‌ ఫోన్స్‌లో మనకి చెప్పకుండానే ఇన్‌స్టాల్‌ అయిపోతుందిది.

బాబ్జీ : ఇదెప్పుడొచ్చిందిరోయ్‌!


రాంజీ : ఆ మధ్యెప్పుడో వచ్చిందిలే! కానీ ఇప్పటికీ ఇది జనాన్ని ఇబ్బంది పెడ్డం మానలేదు. ఆ కాస్పర్‌స్కీ ల్యాబ్‌ వాళ్లు కనుక్కోకపోతే అసలీ వైరస్‌ ఉందనే సంగతే తెలిసేది కాదు.

బాబ్జీ : అవునా?


రాంజీ : అవున్రా. కరోనా దెబ్బకి జనం ఇప్పుడు పాపం ఫోనుల్లోంచీ కంప్యూటర్లలోంచీ పనిచేస్తున్నారు. ఈ ఎక్స్‌ హెల్పర్‌ తో ఇబ్బందయిపోతోంది వాళ్లకి!

బాబ్జీ : సరే. ఇంతకీ ఈ వైరస్‌తో ఏంటట సమస్య?


రాంజీ : చెప్పాను కదా? ఇది మనతో చెప్పకుండానే మన ఫోన్లో ఇన్‌స్టాల్‌ అయిపోతుంది. ఫోన్‌ మొత్తం స్లో చేసి పడేస్తుంది. అంతే కాదు.. ఫోన్లో ఉన్న డేటా మొత్తం యాక్సెస్‌ చేసేస్తుంది.

బాబ్జీ : అయ్యబాబోయ్‌.


రాంజీ : మరేంటనుకున్నావ్‌? దీన్ని ఏం చేయాలో తెలియక... టెక్నికల్‌ హెడ్స్‌ అంతా హెడ్స్‌ పట్టుకుంటున్నారు.

బాబ్జీ : ఏం చేయాలో తెలియకపోవడానికేముంది? వైరస్‌ ని ఫోన్లోంచి డిలీట్‌ చేసి పారేయడమే!


రాంజీ : బావుంది. అంత సులువుగా డిలీట్‌ అయిపోతే ఇంకేం ఉంది? ఆ పని ఎప్పుడో చేసేవారు.

బాబ్జీ : అంటే.. దాన్ని అన్‌ఇన్‌స్టాల్‌ చేయలేమా?


రాంజీ : చేయచ్చురా. కానీ చేస్తే...

బాబ్జీ : చేస్తే?


రాంజీ : చేస్తే మళ్లీ అదే ఇన్‌స్టాల్‌ అయిపోతుంది ఆటోమేటిగ్గా!

బాబ్జీ : అయ్యబాబోయ్‌ అదేంట్రా?


రాంజీ : అదే కదా మరి చెప్పేది? ఎక్స్‌హెల్పర్‌ వైరస్‌ని తీసేయడం అంత సులువు కాదు.

బాబ్జీ : పోనీ... ఆ వైరస్‌ ఫోన్లో అన్నిటికీ ఎఫెక్ట్‌ అవ్వకుండా దాన్ని క్వారంటైన్‌ చేస్తే?


రాంజీ : అబ్బే. అలా కూడా పని కాదు. ఫోన్‌ ఆల్మోస్ట్‌ ఫార్మాట్‌ చేసి, డేటా సేవ్‌ చేసుకుని... అప్పుడు వైరస్‌ తీసి... ఆపైన మొత్తం రిస్టోర్‌ చేసుకోవాలి. అంత కష్టం.

బాబ్జీ : అబ్బో. చూస్తుంటే... ఈ కంప్యూటర్‌ వైరస్‌ కంటే కరోనాయే బెటర్లా ఉందిరా. క్వారంటైన్‌ చేస్తే కంట్రోలయినా అవుతుంది.


రాంజీ : ( ఎక్స్‌ప్రెషన్‌ )



Updated Date - 2020-04-18T03:12:46+05:30 IST