చిన్న వయసులోనే పెద్దవారిలా కనిపిస్తున్నారా? మిమ్మల్ని, ఆంటీ.. అంకుల్ అని పిలుస్తున్నారా? అయితే ఈ అమూల్యమైన విషయాలు మీకోసం..

ABN , First Publish Date - 2021-10-11T17:24:22+05:30 IST

మన ముఖంపై కనిపించే మార్పులకు..

చిన్న వయసులోనే పెద్దవారిలా కనిపిస్తున్నారా?  మిమ్మల్ని, ఆంటీ.. అంకుల్ అని పిలుస్తున్నారా? అయితే ఈ అమూల్యమైన విషయాలు మీకోసం..

మన ముఖంపై కనిపించే మార్పులకు మనం తీసుకునే ఆహారమే ముఖ్యకారణమని చాలామంది భావిస్తారు. కొంతవరకూ ఇది సరైనదే... కానీ నూతన పరిశోధనల ప్రకారం దీనికి మరికొన్ని కారణాలున్నాయని వెల్లడయ్యింది. ముందుగానే వయసు ఛాయలు కనిపించడానికి గల కారణాలను శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. 


నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ జర్నల్ రీసెర్చ్ తెలిపిన వివరాల ప్రకారం పడుకునే తీరు తెన్నులు కూడా ముఖంపై మార్పులకు కారణమవుతాయి. ఫలితంగా కళ్లకింద నల్లటి చారలు ఏర్పడతాయి. అందుకే సరైన భంగిమలో నిద్రించాలి. ఇదేవిధంగా చక్కెరను అధికంగా తీసుకోవడం వలన గ్లైకేషన్ ప్రక్రియలో హానికారక ఫ్రీ రాడికల్స్ మార్పుచెందుతాయి. ఇవి జీవకణాలకు హాని కలిగిస్తాయి. ప్రతీరోజూ 8 గంటలపాటు కంప్యూటర్ ముందు పనిచేసేవారు.. ఎండకు దూరమైనందున వారి చర్మానికి హాని కలుగుతుంది. అయితే ఎండ బాగా ఉన్నప్పుడు బయటకు వెళ్లడం వలన స్కిన్ డ్యామేజ్ అవుతుంది. ఫలితంగా ముఖంపై ముడతలు  ఏర్పడతాయి. అందుకే ఎండలో బయటకు వెళ్లాల్సి వచ్చినపుడు సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవడం ఉత్తమం.


ఇక ఆహారం విషయానికొస్తే నూనెలకు, మసాలాలకు దూరంగా ఉండండి. విటమిన్ సీ కలిగిన ఆహార పదార్థాలు తీసుకుంటే యాంటీఆక్సీడెంట్స్ శరీరానికి తగిన మోతాదులో అందుతాయి. అలాగే ఆహారంలో ఆకుపచ్చని కూరలు ఉండేలా చూసుకోవాలి. శరీరంలో తేమశాతం తగ్గడం కూడా చర్మంపై ముడతలు పడటానికి కారణంగా నిలుస్తుంది. ఇటువంటి సందర్భాల్లో చర్మంపై మాయిశ్చరైజర్ అప్లయ్ చేయాలి. అదేవిధంగా శరీరానికి అవసరమైన మేరకు నీటిని తాగాలి. రోజుకు కనీసం 8 గ్లాసుల నీటిని తాగాలి. ఫలితంగా చర్మం కాంతివంతంగా మారుతుంది. చర్మంపై వయసు ఛాయలు పడకూడదంటే రోజుకు కనీసం గంటపాటు వర్క్‌అవుట్ చేయాలని పరిశోధకులు సూచిస్తున్నారు. ఫలితంగా శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి, శరీర వ్యవస్థలన్నీ సక్రమంగా పనిచేస్తాయి.

Updated Date - 2021-10-11T17:24:22+05:30 IST